దళపతి విజయ్ ఫ్యాన్స్ కి సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత శత్రుత్వం ఉంది. ఆన్ లైన్ ఆఫ్ లైన్ అనేది తేడా లేకుండా రజినీ-విజయ్ ఫ్యాన్స్ గొడవలు పడుతూ ఉంటారు. విజయ్ నంబర్ 1 అని విజయ్ ఫ్యాన్స్… రజినీ ఉన్నంతవరకూ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయనే నంబర్ 1 అని తలైవర్ ఫ్యాన్స్ గొడవ పడుతూనే ఉంటారు. గత ఆరేడేళ్లుగా ఈ గొడవ మరింత ఎక్కువ అయ్యి సోషల్ మీడియాలో ట్రెండ్స్ చేసే వరకూ వెళ్లింది. లేటెస్ట్ గా జైలర్ సినిమా ఆడియో ఫంక్షన్ లో రజినీకాంత్ తన అనుభవం గురించి మాట్లాడుతూ… “ఒక కాకీ గద్ద కథ” చెప్తే అది విజయ్ గురించే అంటూ పెద్ద రచ్చ చేసారు. ఇప్పుడు లియో సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ హిస్టరీని తిరగరాస్తుంటే రజినీ ఫ్యాన్స్ అవి ఫేక్ రికార్డ్స్ అంటున్నారు. ఇలా ఎప్పుడు సందు దొరికినా గొడవ పడుతుంటే… ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయడానికి దళపతి విజయ్ నోటి నుంచి రజినీకాంత్ పేరొచ్చింది.
లియో సక్సస్ మీట్ ని గ్రాండ్ గా చేసారు మేకర్స్. ఈ సక్సస్ మీట్ లో విజయ్ మాట్లాడుతూ… “ఒకరే కెప్టెన్, ఒకరే లోకనాయకుడు, ఒకరే సూపర్ స్టార్, ఒకరే తల” అంటూ మాట్లాడాడు. మాములుగా తన సినిమా ఫంక్షన్స్ లో ఇతర హీరోల గురించి చాలా తక్కువగా ప్రస్తావించే విజయ్… లియో సక్సస్ మీట్ లో మాత్రం అదే పనిగా ప్రతి స్టార్ హీరోని కవర్ చేసాడు. విజయ్ మాటలు సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్స్ తెచ్చాయి. ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ “మీరు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువ కోపం చూపిస్తున్నారు. మనకి అది వద్దు నన్బా, అందరితో స్నేహంగా ఉందాం” అంటూ విజయ్ ఫ్యాన్స్ కి కోరాడు.
సడన్ గా విజయ్ స్పీచ్ లో ఇంత మార్పు రావడానికి కారణం త్వరలో మొదలుకానున్న రాజకీయ ప్రయాణమే అని తెలుస్తోంది. రాజకీయాల్లో నిలబడాలి అంటే ఒక కేవలం తన అభిమానులు సపోర్ట్ చేస్తేనో, వాళ్లు మాత్రం ఓటేస్తేనో సరిపోదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో అభిమానులు కలిసి విజయ్ కి సపోర్ట్ చేయాలి అప్పుడే విజయ్ ఎన్నికల్లో నిలబడినా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఈ విషయం అర్ధం చేసుకున్నాడు కాబట్టి విజయ్ అందరు హీరోల గురించి ప్రస్తావన తెచ్చి, సోషల్ మీడియా వార్స్ వద్దు, అందరితో ప్రేమగా ఉండండి అని తన ఫ్యాన్స్ కి సలహా ఇస్తున్నట్లు ఉన్నాడు. మరి రాజకీయాల్లోకి రాకుండానే రాజకీయాలని బాగానే అర్ధం చేసుకున్న విజయ్… ఫ్యూచర్ లో ఎలాంటి పొలిటికల్ జర్నీ చేయబోతున్నాడో చూడాలి.