సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత తమిళనాడు బీ,సి సెంటర్స్ లో ఆ రేంజ్ మాస్ ఫ్యాన్ బేస్ ఉన్న ఏకైక హీరో తల అజిత్ అకా AK. ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించగల పర్ఫెక్ట్ స్టార్ యాక్టర్ గా అజిత్ పేరు తెచ్చుకున్నాడు. గత కొంతకాలంగా అజిత్ ని నంబర్స్ గేమ్ లో వెనక్కి నెట్టి దళపతి విజయ్ రేస్ లోకి వచ్చాడు కానీ ఇప్పటికీ అజిత్ సినిమా వస్తుంది అంటే కోలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. ఈ ఇయర్ సంక్రాంతికి తునివు సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న అజిత్, తన నెక్స్ట్ సినిమాని మగిళ్ తిరుమేని దర్శకత్వంలో చెయ్యడానికి రెడీ అయ్యాడు. లైకా ప్రొడక్షన్ హౌజ్ నుంచి వస్తున్న ఈ మూవీకి ‘విడ ముయర్చి’ అనే టైటిల్ ని ఫైనల్ చేసి మేకర్స్ ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. సినిమాల విషయం కాసేపు పక్కన పెడితే అజిత్ కి బైక్స్ అంటే చాలా ఇష్టం. సినిమా సినిమాకి మధ్య గ్యాప్ లో బైక్ ట్రిప్స్ కూడా వేస్తూ ఉంటాడు. ఇటీవలే ఇండియా మొత్తం తిరిగిన అజిత్, నవంబర్ నుంచి వరల్డ్ టూర్ ని రెడీ అయ్యాడు. ఈ సందర్భంగా తన ఇష్టాన్ని వ్యాపారంగా మారుస్తూ అజిత్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసాడు.
Discipline makes life easier#AKMOTORIDE pic.twitter.com/wf5kZHMVdt
— Suresh Chandra (@SureshChandraa) May 22, 2023
AK మోటర్ రైడ్ అనే కంపెనీ పెడుతూ అజిత్… “జీవితం అనేది ఓ అందమైన ప్రయాణం, అందులోని ట్విస్ట్, టర్న్‌లతోపాటు మనముందున్న తెరిచిన మార్గాలను అనుభవించాలి’ నేను ఇదే పద్దతిని ఫాలో అవుతా. ప్రస్తుతం నేనొక కొత్త బిజినెస్ ప్రారంభించబోతున్నా. స్వదేశీ, విదేశీ బైక్ రైడింగ్ విహార యాత్రను ఇప్పుడు ఒక వృత్తిగా మార్చే ప్రయత్నం చేస్తున్నా. ఈ మేరకు ఏకే మోటో రైడ్ పేరుతో మోటార్ బైక్ విహార యాత్ర సంస్థను ప్రారంభిస్తున్నా. దీని ద్వారా భారతదేశంలోని ప్రకృతి అందాలను, అంతర్జాతీయ రోడ్లపై ప్రయాణం చేయాలన్న ఆసక్తిని కనబరచేవారికి ఏకే మోటో రైడ్ సంస్థ విహార పయనం నేర్చుకోవడానికి సహకరిస్తుంది. అలాంటి వారికి తగిన భద్రతతోపాటు సౌకర్యవంతమైన మోటార్ బైక్లను సమకూర్చడం జరుగుతుంది” అంటూ లెటర్ ని రిలీజ్ చేసాడు. తమ ఫెవరెట్ హీరో పిలిస్తే ఫాన్స్ సైలెంట్ గా ఉంటారా… AK మోటార్ రైడ్ బిజినెస్ అఫీషియల్ గా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందా? ఎప్పుడు బైక్స్ తీసుకోని ప్రపంచాన్ని చుట్టేద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.