జనాలకు ఇప్పుడు ‘పుష్ప’ ఫీవర్ పట్టుకుంది. ఎక్కడ చూసినా ‘పుష్ప’ సినిమా గురించి, అందులోని సాంగ్స్ గురించే చర్చ జరుగుతోంది. ఇక తాజాగా విడుదలైన సమంత ఐటెం సాంగ్ అయితే సౌత్ ను ఊపేస్తోంది. ఒకవైపు సాంగ్ పై వివాదం నడుస్తున్నప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఈ సాంగ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక కాసేపట్లో “పుష్ప” ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగబోతోంది. దీని కోసం హైద్రాబాదులోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. అక్కడికి పోటెత్తుతున్న అభిమానులను నిలువరించడం ఎవరి వల్లా కావడం లేదు. పోలీసులకు ఒక దశలో వాళ్ళను ఆపడం సాధ్యం కాకపోవడంతో ఒక్కసారిగా బారికేడ్లను తోసుకుంటూ లోపలికి వచ్చేశారు ఫ్యాన్స్. దీంతో అక్కడ జనల మధ్య తోపులాట జరిగింది. ఈ సినిమా విడుదలకు మరో 4 రోజులు మాత్రమే ఉండడంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పెద్ద ఎత్తున్న జరుగుతున్నట్టు సమాచారం.
Read Also : బిపిన్ రావత్ మృతికి అగౌరవం అంటూ డైరెక్టర్ షాకింగ్ డెసిషన్