June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
June 2026 Movie Releases: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘పెద్ది’ థియేటర్లలోకి వచ్చి సందడి సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల (జూన్) లో పెద్ది తర్వాత థియేటర్లలోకి రాబోయే సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ మరింత రసవత్తరంగా మారబోతోందని సమాచారం. ‘పెద్ది’ ఇచ్చిన జోష్‌ను కంటిన్యూ చేస్తూ, ఈ నెలలో థియేటర్లలో సందడి చేయడానికి డిఫరెంట్ జోనర్స్ కలిగిన క్రేజీ చిత్రాలు క్యూ కట్టాయి. మరి ఈ జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ సినిమాలు ఏంటో, వాటిపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జూన్ 12 – ‘సింగీతం’
టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కథ, దర్శకత్వంలో.. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ నిర్మించిన వినూత్న చిత్రం ‘సింగీతం’. నాగ్ అశ్విన్ ప్రొడక్షన్ వాల్యూస్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం తోడవ్వడంతో ఈ సినిమాపై టాలీవుడ్లో ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయింది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా కోసం క్లాస్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
జూన్ 19 – ‘సమంత’ ‘మా ఇంటి బంగారం’
స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్లో నటించిన ‘మా ఇంటి బంగారం’ జూన్ 19న రిలీజ్ కానుంది. ‘ఓ బేబీ’ లాంటి హిట్ తర్వాత నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో సమంత చీరకట్టులో చేసిన రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్సులు, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సమంత యాక్షన్ పవర్‌ను స్క్రీన్‌పై చూడటానికి ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
జూన్ 19 – ‘వంద దేవుళ్లు’
అదే రోజు (జూన్ 19) వైవిధ్యభరితమైన చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వరుస ఫ్లాప్‌ల తర్వాత విజయ్ ఆంటోనీ చేస్తున్న ఈ ప్రయత్నంపై పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా, ఆయన మార్క్ కంటెంట్‌ను నమ్ముకుని థియేటర్లకు వచ్చే ఆడియన్స్ ఉన్నారు. వీటితో పాటు సాంగ్స్, టీజర్‌తో యూత్‌లో మంచి బజ్ సంపాదించుకున్న ‘దీవానా’ సినిమా కూడా అదే రోజు పోటీకి సై అంటోంది.
జూన్ 26 – అఖిల్ ‘లెనిన్’
అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ ‘లెనిన్’. ఈ చిత్రం జూన్ 26న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతుంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో, సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. అఖిల్ చిత్తూరు యాసలో పలికిన డైలాగ్స్, తమన్ మ్యూజిక్ ఈ సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న ఈ సినిమాతో అఖిల్ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.
తాజావార్తలు
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..