NTV Film Roundup : Telugu Movie Shooting Updates 12th December 2023: ప్రస్తుతం తెలుగు సినిమా షూటింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? ఏ ఏ సినిమాలో షూటింగ్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి? అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1. Naa SaamiRanga – నాగార్జున హీరోగా ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న నా సామిరంగా అనే సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. నాగార్జున- హీరోయిన్ కాంబినేషన్లో ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకి విజయ్ బిన్నీ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు, ఆయనకిది మొదటి సినిమా.
2. Guntur Karam – త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం అనే సినిమా తెరకెక్కుతోంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మితమవుతున్న ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది. నిన్న పబ్లో కొన్ని షాట్స్ చిత్రీకరించగా ఈరోజు కూడా ఈ అదే సాంగ్ కి సంబంధించి సిటీలోని కొన్ని ప్రాంతాలలో షూటింగ్ చేస్తున్నారు మేకర్స్.
3. Devara – జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా తెరకెక్కుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ తో పాటు కళ్యాణ్ రామ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుగుతోంది.
4. Family Star – విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం పెట్ల దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ అమెరికాలోని న్యూయార్క్ సిటీలో శరవేగంగా జరుగుతోంది.
5. The Girlfriend – రష్మిక హీరోయిన్గా గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా తెరకెక్కుతోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా చెబుతున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. ఈరోజు ఈ షెడ్యూల్లో రష్మికకు చివరి రోజు షూటింగ్ అని చెబుతున్నారు.