Sukumar : డైరెక్టర్ సుకుమార్ ఒక కథను ఎమోషన్ తో యాక్షన్ ను జోడించి చెప్పడంలో దిట్ట. ఆయన ప్రతి సినిమాలో ఒక ఎమోషన్ ను హైలెట్ చేస్తుంటాడు. హీరో పాత్రకు దాన్ని జోడిస్తూ.. అతని యాక్షన్ కు ఒక అర్థాన్ని చూపిస్తాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప సినిమాలు చూస్తే ఇది అర్థం అవుతుంది. హీరోకు అవమానం జరగడమో లేదంటే తన జీవితంలో ఒకదాన్ని సాధించడం కోసం విలన్లతో పోరాడటమో మనకు కనిపిస్తుంది. ప్రతి సినిమాలో హీరోను ముందుగా ఒక బాధితుడిగా మనకు చూపిస్తాడు సుకుమార్. అప్పుడు ఆ హీరో విలన్లతో ఫైట్లు చేసినా మనకు ఒక సంతృప్తి కలుగుతుంది. ఆ ఫైట్లు మనకు బోర్ కొట్టవు. అప్పుడు హీరో గెలిస్తే మనం గెలిచినట్టు ఫీల్ అయిపోతాం.
Read Also : HHVM : ప్రీమియర్ షోలు.. వీరమల్లుకు కలిసొస్తాయా..?
ఇదే ఎమోషన్ ను ఇప్పుడు చాలా మంది డైరెక్టర్లు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు బుచ్చిబాబు రామ్ చరణ్ తో చేస్తున్న పెద్ది సినిమాలో కూడా ఇదే రకమైన ఎమోషన్ ను చూపించబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే నానితో శ్రీకాంత్ ఓదెల తీస్తున్న ది ప్యారడైజ్ మూవీ కూడా అదే బాటలో రాబోతోందంట. ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న కింగ్ డమ్ సినిమాలో అన్నదమ్ముల అనుబంధంతో కూడాని ఎమోషన్ ను చూపించనున్నారు. ప్రశాంత్ నీల్ ఇలాంటి ఎమోషన్లను తన ప్రతి సినిమాలో మనకు చూపిస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో చేస్తున్న మూవీలో కూడా అలాంటి ఎమోషన్ ను హైలెట్ చేస్తున్నాడంట. హీరోకు ఒక ఎమోషన్ లేదా సెంటిమెంట్ ను కనెక్ట్ చేస్తే ప్రేక్షకులు ఒక మోడ్ లోకి వెళ్లి మూవీకి కనెక్ట్ అయిపోతారు. ఈ లెక్కలు సుకుమార్ కు బాగా తెలుసు. ఆ లెక్కలు బాగా వర్కౌట్ అవుతుండటంతో మిగతా డైరెక్టర్లు కూడా హీరోల పాత్రలకు ఎమోషన్ సెంటిమెంట్ ను అంటించేస్తున్నారు.
Read Also : Pawan Kalyan : మొత్తానికి మీడియా ముందుకు పవన్..