Kannappa : మంచు విష్ణు హీరోగా వచ్చిన కన్నప్ప మూవీ థియేటర్లలో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్లు ఉన్నా.. ఆ స్థాయిలో బాక్సాఫీస్ కలెక్షన్లు రాబట్టలేదు. కానీ చాలా మంది ఈ మూవీని ప్రశంసిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈ సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమాను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖల అధికారులు చూశారు.
Read Also : KTR : నిధులు రాహుల్ కు.. నీళ్లు చంద్రబాబుకు.. కేటీఆర్ కామెంట్స్
ఈ సందర్భంగా విష్ణు నటనను ప్రశంసించారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇది తమ మూవీకి గర్వకారణం అంటూ తెలిపింది. ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేశారు. కన్నప్ప కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. భక్తి కథగా వచ్చిన కన్నప్ప ఇప్పటికే ఎంతో మంది ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు రాష్ట్రపతి భవన్ లో ప్రదర్శించారు.
Read Also : Telangana : తెలంగాణలో తగ్గిన ఎంపీటీసీల సంఖ్య