Chinni Serial: స్టార్ మా సరికొత్త సీరియల్ “చిన్ని”
- స్టార్ మా సరికొత్త సీరియల్ చిన్ని
- సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7 గంటలకు ప్రసారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinni Serial: చిన్ని.. ఈ పేరులోనే గుండె తలుపు తట్టే ఆప్యాయత, మనసుకి బాగా దగ్గరైన మమకారం వినిపిస్తాయి. ఈసారి స్టార్ మా ప్రారంభించబోతున్న సరికొత్త సీరియల్ పేరు “చిన్ని”. తల్లి సెంటిమెంట్ నడిపించే ఒక కొత్త తరహా కథతో సిద్ధమైన ఓ అమ్మాయి కథ ఇది. జైలు లో పుట్టి, జైలు లోనే తల్లితోపాటు వుండి, అదే ప్రపంచం అనుకుని, అక్కడున్నవాళ్ళే తన బంధువులు అనుకుని పదేళ్లవరకు పెరిగిన చిన్ని తల్లిని వదిలి బయటి ప్రపంచానికి వస్తుంది. అమ్మని వదిలి.. అమ్మ ఇచ్చిన నమ్మకంతో బయటకి కదిలిన చిన్ని తరవాతి జీవితం ఎలా వుండబోతోంది? అసలు తల్లి జైలు లో ఎందుకు ఉండాల్సివచ్చింది? చిన్ని కి నీడనిచ్చేది ఎవరు? అసలు పరిచయం లేని ప్రపంచంలో చిన్ని ఎలా వుండబోతోంది? అమ్మ లేని చోట తనకి అంత ప్రేమ దక్కుతుందా? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ “చిన్ని” సీరియల్.
తల్లీ కూతుళ్ళ మధ్య ప్రేమానుబంధాలు, భావోద్వేగాలకు “చిన్ని” సీరియల్ వేదిక కాబోతోంది. చిన్ని చూడని ఓ కొత్త ప్రపంచం ఆమెని ఎలా అక్కున చేర్చుకోబోతోందో, చిన్ని అక్కడ ఎన్ని సమస్యలు ఎదుర్కోబోతోందో.. తల్లి ఇచ్చిన ధైర్యంతో ఎవరికి ఎలా సమాధానం చెప్పి నెగ్గుకొస్తుందో.. మనకి చెబుతుంది “చిన్ని” కథ. స్టార్ మా లో “చిన్ని” సీరియల్ జులై 1 న ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతుంది. స్టార్ మా ప్రేక్షకులకు ఇది ఓ కొత్త అనుభూతి. ఒక చిన్న పాప కథగా మొదలై, ఆమె పెరిగి పెద్దదయ్యే క్రమంలో చూసే కథంతా ఎన్నో మలుపులు.. మెరుపులు !! తప్పక చూడండి.
Also Read
తాజావార్తలు
-
Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
-
Konda Murali : కాంగ్రెస్‌ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
-
Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
-
YS Jagan: ‘సీఎంగా ఏం చేస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
-
Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..