తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించడంలో ముందుండే జీ తెలుగు మరో సర్ప్రైజ్‌తో వచ్చేస్తోంది. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో విజయవంతంగా కొనసాగుతున్న సీరియల్స్‌ని ఇకనుంచి ఆదివారం కూడా అందించేందుకు సిద్ధమైంది. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారమయ్యే సీరియల్స్ అన్నీ సెప్టెంబర్ 7 నుంచి ఆదివారం కూడా ప్రసారం అవుతాయి. నిండు నూరేళ్ల సావాసం, పడమటి సంధ్యారాగం, లక్ష్మీ నివాసం, మేఘసందేశం, జయం, చామంతి సీరియల్స్ ఇకనుంచి ఆదివారం కూడా తమ అభిమానులను అలరిస్తాయి.
Also Read :Tunnel : అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లతో ‘టన్నెల్’ ట్రైలర్
నిండు నూరేళ్ల సావాసం సాయంత్రం 6 గంటలకు, పడమటి సంధ్యారాగం 6:30 గంటలకు, లక్ష్మీ నివాసం రాత్రి 7 గంటలకు, మేఘసందేశం 7:30 గంటలకు, జయం 8 గంటలకు, చామంతి 8:30 గంటలకు ప్రసారం కానున్నాయి. ఈ నాన్‌స్టాప్ సీరియల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ వారం నుంచే ప్రారంభమవుతోంది. అశేష ప్రేక్షకాభిమానం పొందుతున్న ఈ ఆరు సీరియల్స్ ఇకనుంచి ప్రతిరోజూ ప్రేక్షకులను అలరించనున్నాయి. మధ్యాహ్నం సీరియల్స్ మాత్రం యథాతథంగా సోమవారం నుంచి శనివారం వరకు వాటి వాటి సమయాల్లో ప్రసారమై ప్రేక్షకులను అలరిస్తాయి.