Mirai : తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఏ పెద్ద సినిమాకు లేనంతగా మిరాయ్ కు రోజురోజుకూ టికెట్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయి. దీని వెనకాల ఓ తేజ సజ్జా తీసుకున్న నిర్ణయం ఉంది. సినిమా రిలీజ్ కు ముందే టికెట్ రేట్లు పెంచట్లేదని తేజ ప్రకటించాడు. తాను కష్టపడి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లను ఒప్పించి టికెట్లు పెంచకుండా చూశానన్నాడు. సినిమా బాగుందని.. ఇలాంటి మంచి సినిమాను థియేటర్ లో ప్రేక్షకులు చూడాలనే ఉద్దేశంతోనే రేట్లు పెంచకుండా నార్మల్ రేట్లకే అందిస్తున్నట్టు తెలిపాడు. రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు తక్కువ రేట్ కాబట్టి థియేటర్లకు క్యూ కడుతున్నారు.
Read Also : Little Hearts Jai Krishna : టాలీవుడ్ కు కొత్త కమెడియన్ వచ్చాడోచ్..
పైగా ఇలాంటి విజువల్స్ ఉన్న సినిమాను కచ్చితంగా థియేటర్ లోనే చూడాలనే మౌత్ టాక్ బాగా పనిచేసింది. అందుకే ఓటీటీలో, ఫోన్లలో చూడటం కంటే థియేటర్ లో చూడాలని ప్రేక్షకుల్లో చర్చ జరుగుతోంది. రిలీజ్ అయి ఆరు రోజులు అవుతున్నా సరే టికెట్స్ రోజుకు లక్ష వరకు సేల్ అవుతున్నాయి. ఒకవేళ సినిమా బాగున్నా టికెట్ రేట్లు ఎక్కువగా ఉంటే ఈ స్థాయిలో టికెట్లు సేల్ అయ్యేవి కావు. ఈ విషయంలో తేజ ముందు చూపు బాగా పనిచేసింది. కాబట్టి మిగతా హీరోలు కూడా తమ ఫ్యాన్స్ కోసం తమ సినిమాలను నార్మల్ రేట్స్ కే అమ్మితే పాజిటివ్ వైబ్స్ పెరిగి టికకెట్లు ఎక్కువగా సేల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మంచి సినిమాలు తీశామనే నమ్మకం ఉంటే ఇలా నార్మల్ రేట్లకే టికెట్లు అమ్మితే బెటర్.
Read Also : Ravali : ఈ స్టార్ హీరోయిన్ ను గుర్తు పట్టారా.. ఇలా మారిందేంటి..?