Teja Sajja Reaction to Dil Rajus Comments on Hanuman Movie: ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తెలుగు సంక్రాంతి సినిమాల విడుదల విషయంలో కొన్ని వివాదాలు ఏర్పడ్డాయి. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు కావాలని హనుమాన్ సినిమాకి థియేటర్లు ఇవ్వలేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అయితే తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు హోదాలో దిల్ రాజు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈగల్ సినిమా వాయిదా పడిందని ప్రకటించారు. ఆ సమయంలోనే సంక్రాంతి సినిమాలలో తేజ హీరోగా నటించిన హనుమాన్ సినిమా చిన్న సినిమా అని అభివర్ణించారు. తాను పెద్ద సినిమా చిన్న సినిమా మధ్య ఎలా తేడా చెబుతాను అనే దానికి కూడా ఆయన సమాధానం ఇచ్చారు. రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలలో మొదట ఏ సినిమా చూడాలని ఎక్కువ మంది అనుకుంటానో అది పెద్ద సినిమా అని, చివరన చూడాలనుకునే అది సినిమా చిన్న సినిమా అని చెప్పుకొచ్చారు.
Naga Vamsi: వాళ్ళ మాటలు నమ్మకుండా మీరందరూ ధియేటర్లకు వచ్చి సినిమా చూడండి
ముందు మహేష్ బాబు తర్వాత నాగార్జున, వెంకటేష్ ఆ తర్వాత తేజ సినిమా చూడడానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి అది చిన్న సినిమా అన్నట్టు అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. అయితే తాజాగా ఇదే విషయాన్ని గురించి తేజ సజ్జాను అడిగితే దిల్ రాజు ఎలా మాట్లాడారో తనకు తెలియదు కానీ ఆయన ఎలా మాట్లాడి ఉండొచ్చో తాను ఊహించగలను అన్నారు. ఆయన ఉద్దేశం ప్రకారం సీనియారిటీతో చూస్తే మిగతా పండుగ సినిమాలు హీరోలతో పోలిస్తే హీరోయిజం వైజ్ నేను చిన్న కాబట్టి మాది చిన్న సినిమా అని ఉండవచ్చు. ఆయనకి నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఇప్పటికిప్పుడు ఫోన్ చేసినా మొదటి రింగ్ కే ఆయన ఎత్తి మాట్లాడుతారు. బహుశా ఆయన మాటలు తప్పుగా కన్వే అయి ఉండవచ్చు. నాలుగైదు సినిమాలు పోటీలో ఉన్నప్పుడు ఇలాంటివి సాధారణం అని తేజ అభిప్రాయపడ్డాడు.