Teja Sajja to become the 8th hero to enter the Telugu 100Cr Share Club: ఇటీవలే హనుమాన్ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు తేజ సజ్జా. ఇప్పుడు ఆయన ఈ సినిమాతో ఒక అరుదైన ఫీట్ సాధించబోతున్నట్లుగా తెలుస్తోంది. హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో హీరోగా నటించిన ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ తేజ తన పర్ఫామెన్స్ తో ఆడియన్స్ అందర్నీ మెస్మరైజ్ చేశాడు. ఇక ఈ సినిమాతో తేజ తెలుగులో 100 కోట్లు షేర్ సినిమాలు ఉన్న హీరోలలో ఎనిమిదవ హీరోగా అవతరించబోతున్నాడు. నిజానికి బాహుబలి సినిమాతో ప్రభాస్ ఈ లిస్టులో మొదటి హీరోగా జాయిన్ అయ్యాడు. ప్రభాస్ తర్వాత చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఆ తర్వాత కన్నడ హీరో యష్ మాత్రమే తెలుగులో 100 కోట్లు సినిమాలు చేసిన హీరోలుగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఏడుగురు తర్వాత తెలుగులో 100 కోట్లు షేర్ సాధించిన హీరోగా తేజ సబ్జా అవతరించబోతున్నాడు.
Breath Lock: ఫింగర్ ప్రింట్ లాక్, ఫేస్ లాక్ కాదు ఈసారి ఏకంగా బ్రీత్‌తో లాక్!
నిజానికి ఈ సినిమాకి ఇప్పటికీ టికెట్లు దొరకని పరిస్థితులు నెలకొన్నాయి అంటే సినిమాకి క్రేజ్ ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే కొంతమేర థియేటర్లు తక్కువ ఉండడం సినిమాకి కొంతవరకు మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే జనవరి 25వ తేదీ వరకు సరైన సినిమా లేకపోవడం ఈ సినిమాకి కలిసొచ్చే అంశంగానే చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా తెలుగులో 50 కోట్ల షేర్ సాధించింది. రెండో వారం మొదటి వారం కంటే ఎక్కువ వసూళ్లు నమోదు అవుతున్న నేపథ్యంలో రిపబ్లిక్ డే వచ్చేలోపు 100 కోట్లు సాధించడం పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారు. ఈ నేపథ్యంలో `100 కోట్లు హీరోల లిస్టులో తేజ కూడా త్వరలో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.