Teach for Change Fashion Show: ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నోటల్ లో ప్రముఖ సిననటి లక్ష్మీ మంచు ఆధ్వర్యంలో పేద విద్యార్థుల చదువులకు నిధుల సమీకరణ కోసం ప్రతి ఏటా నిర్వహించే టీచ్ ఫర్ ఛేంజ్ ఫ్యాషన్ షో మరోసారి ఘనంగా జరిగింది. టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సమీకరణ ఫ్యాషన్ షో కోసం ఈ సారి షో స్టాపర్‌లుగా శ్రుతి హాసన్, శ్రియా శరణ్ మరియు హర్షవర్ధన్ లతోపాటు ప్రముక క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ వంటి ప్రముఖులు ర్యాంప్ వాక్ చేశారు. ఇక పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సమీకరణ కోసం ఫిబ్రవరి 11న 9వ ఎడిషన్ లక్ష్మీ మంచు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈవెంట్‌లో మహిళల దుస్తుల కోసం ప్రఖ్యాత ఫ్యాషన్ మాస్ట్రోలు అమిత్ జీటీ, పురుషుల దుస్తుల కోసం శశాంక్ చెల్మిల్లా రూపొందించిన డిజైన్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ కార్యక్రమానికి సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ ఆభరణాలు స్పాన్సర్ చేసింది.
టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సమీకరణ కోసం నగరానికి చెందిన వివిధ రంగాల ప్రముఖులు హాజరై తమవంతు సాయాన్ని అందిస్తూ నాణ్యమైన, మెరుగైన విద్యకు సాయంగా నిలుస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే ఆదాయం సంస్థ అభివృద్ధి మరియు కార్యక్రమాలకు కోసం వినియోగిచబడుతుంది, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారాన్నిచూపేందుకు ఈ సంస్థ ముందుకెల్తుంది. ఈ షో లో సీరత్, ఫరియా అబ్దుల్లా, అవంతిక మిశ్రా, లేఖా ప్రజాపతి, అలేఖ్య హారిక, రాశి సింగ్, అక్షర గౌడ, అశోక్ గల్లా, ప్రదీప్ మాచిరాజు, విరాజ్ అశ్విన్, శ్రుతి హాసన్, శ్రియా శరణ్, హర్షవర్ధన్ రాణే వంటి ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.