Little hearts : సెప్టెంబర్ 5న థియేటర్లలోకి మూడు సినిమాలు రాగా.. అందులో లిటిల్ హార్ట్స్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా అదరగొడుతోంది. మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మౌళి తనూజ్ హీరోగా శివానీ నగరం హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతో మౌళి హీరోగా నిరూపించుకున్నాడు. యాక్టింగ్ పరంగా మంచి మార్కులు వేయించుకున్నాడు. అయితే మౌళి తనూజ్ కు ఇది హీరోగా తొలి సినిమానే. కామెడీ పరంగా బాగా అదరగొట్టేసింది. ఈ సినిమాకు మౌళి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడనే డౌట్ అందరిలోనూ ఉంది.
Read Also : Alekya chitti sisters : అవి బాగుండాలంటూ నీచంగా మాట్లాడారు.. రమ్య మోక్ష ఎమోషనల్
ఈ సినిమా బడ్జెట్ రూ.2 కోట్లు. దీనికి మౌళి రూ.35లక్షల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నాడంట. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకోవడంతో ఇప్పుడు ఆయనకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. వరుసగా పెద్ద నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్లు వస్తుండటంతో మౌళి ఫుల్ హ్యాపీగా ఉన్నాడంట. కానీ కథల విషయంలో ఆచితూచి ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏది పడితే అది సెలెక్ట్ చేసుకోకుండా సరైన సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడంట. ప్రస్తుతానికి లిటిల్ హార్ట్స్ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.
Read Also : Raghava Lawrence : లారెన్స్.. నువ్వు బంగారం.. దివ్యాంగురాలికి ఏం చేశాడంటే..