Tammareddy Bharadwaj: టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై కానీ, ప్రస్తుత రాజకీయాలపై కానీ ఆయన నిత్యం తన యూట్యూబ్ ద్వారా తన అభిప్రాయాలను చెప్తూనే ఉంటారు. ఇక వీటితో పాటు కొన్ని ఇంటర్వ్యూలలో కూడా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై తమ్మారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి ఎన్టీఆర్, బాలకృష్ణ ఇన్వాల్వ్మెంట్ పార్టీలో ఉంటుందని మీరు భావిస్తున్నారా..? అన్న ప్రశ్నకు తమ్మారెడ్డి మాట్లాడుతూ “బాలకృష్ణ ఆల్రెడీ పార్టీలో ఉన్నారు.
ఇక తారక్ అంటే నాకు తెలియదు. ప్రస్తుతం అతను కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి అతడు పార్టీలోకి రాడని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ కు అయితే రాడు. వచ్చే ఎలక్షన్స్ లో ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు. అంటే పార్టీలోకి రావాలని ఎన్టీఆర్ కు ఉంది. మంచి సమయం చూసి అడుగుపెట్టాలనే ఆలోచనలో ఉన్నాడు” అని అన్నారు. ఇక లోకేష్ ఏమైనా పగ్గాలు పట్టుకుంటాడు అని అనుకుంటున్నారా..? అన్న ప్రశ్నకు.. అతనికి అంత లేదు. మంత్రిగా, ఎమ్మెల్సీ గా ఓడిపోయినా తండ్రి ఎంత ఇచ్చినా లోకేష్ చేయగలిగి ఉంటే… పార్టీ ఈ పరిస్థితిలో ఉండకూడదు. ఓడిపోయినా తరువాత కూడా దాన్ని బాగా తీసుకురావచ్చు. అతనికి ఎంతో ఫాలోయింగ్ ఉంది.. కానీ చూపించలేకపోతున్నాడు. చేయలేకపోతున్నాడు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.