Tamil Rockerz: ‘తమిళ రాకర్స్’ స్ట్రీమింగ్ కు ముహూర్తం ఖరారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా విడుదలైన గంటల్లోనే వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తూ దక్షిణాది చిత్రాలకు కీడు చేస్తున్న ‘తమిళ్ రాకర్స్’ గురించి ప్రేక్షకులకు పరిచయం ఉంది. వీళ్ల నెట్ వర్క్ ఎలా పనిచేస్తోందనే నేపథ్యంతో ప్రముఖ నిర్మాణ సంస్థ రూపొందించిన వెబ్ సిరీస్ ‘తమిళ్ రాకర్స్’. అరుణ్ విజయ్, వాణి బోజన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. అరుణ నిర్మాణ సారథ్యంలో అరివఝగన్ దీన్ని రూపొందించారు. సోని లివ్ ఓటీటీలో ఈనెల 19న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
Also Read
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
- Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
- “ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
దర్శకుడు అరివఝగన్ మాట్లాడుతూ, ”తమిళ్ రాకర్స్ దక్షిణాది చిత్రాలతో పాటు బాలీవుడ్ కు కూడా ప్రమాదకరంగా తయారయ్యారు. వీళ్లు ఎలా పనిచేస్తున్నారు అనే అంశాన్ని కథగా చేసుకుని ఈ వెబ్ సిరీస్ రూపొందించాం. వాళ్లు సినిమాలను ఎలా ఫిల్మింగ్ చేస్తున్నారు? ఎలా అప్ లోడ్ చేస్తున్నారు? వీళ్లు ఇలా కొత్త సినిమాలను వెబ్ సైట్ పెట్టడం వల్ల ఏ ప్రయోజనం ఆశిస్తున్నారు? వీళ్ల నెట్ వర్క్ ఎలా పనిచేస్తోంది? అనే ప్రశ్నలకు మా చిత్రంలో సమాధానం చెప్పబోతున్నాం” అని అన్నారు. హీరో అరుణ్ విజయ్ మాట్లాడుతూ, ”దర్శకుడు అరివఝగన్ తో గతంలో ‘ఈరమ్’, ‘కుట్రమ్ 23’ మూవీస్ చేశాను. ప్రస్తుతం ఆయనతో ‘బార్డర్’ అనే సినిమా చేస్తున్నాను. యూనిక్ కాన్సెప్ట్ తో ప్రతిసారీ ఆయన సినిమాలు చేస్తుంటారు. తమిళ్ రాకర్స్ గురించి మనకు తెలుసు. ఈ సిరీస్ ద్వారా వాళ్ల ముఠాను వెలుగులోకి తీసుకురావాలని ప్రయత్నించాం. ఒక సినిమా మేకింగ్ లో ఎంత శ్రమ ఉంటుందో మీకు తెలుసు. ఆ కష్టం ఇలా పైరసీ వల్ల దోపిడీకి గురవుతోంది. మనం వీళ్లను పట్టించడం ఈ సమస్యకు ఒక పరిష్కారం అయితే రెండోది ప్రేక్షకులు ఎవరూ పైరసీ సినిమాలు చూడకుండా బహిష్కరించాలి. అప్పుడే తమిళ్ రాకర్స్ లాంటి వెబ్ సైట్స్ పతనం అవుతాయి” అని చెప్పారు.
నిర్మాత అరుణ గుహ మాట్లాడుతూ, ”మా ఏవీఎం సంస్థ అనేక భారతీయ భాషల్లో చిత్రాలను నిర్మించింది. తొలిసారి వెబ్ సిరీస్ ను నిర్మించాం. ఓటీటీ, సినిమా రెండూ మనకు ముఖ్యమే. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా మనమూ మారాలి. ఈ వెబ్ సిరీస్ తో ఫిల్మ్ ప్రొడక్షన్ లో మా బౌండరీస్ ను మరింత విస్తృతం చేశాం. ప్రేక్షకులు చూడకుంటే ఇలాంటి సైట్ లు తగ్గిపోతాయి. ఏవైనా ఇలాంటి యాప్ లు ఉన్నా వాటిని బ్లాక్ చేయొచ్చు. ఈ వెబ్ సిరీస్ తో వాస్తవ ఘటనలను కల్పిత సన్నివేశాలతో కలిపి తెరకెక్కించాం” అని అన్నారు. హీరోయిన్ వాణి బోజన్ మాట్లాడుతూ, ”ఈ వెబ్ సిరీస్ లో సంధ్య అనే క్యారెక్టర్ లో నటించాను. ఇది మీకొక మంచి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అనుభూతిని పంచుతుంది” అని చెప్పింది.
తాజావార్తలు
-
Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..