Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hatha Teaser: టాలీవుడ్లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ హీరో కిరణ్ అబ్బవరం, ఇప్పుడు నిర్మాతగానూ దూకుడు పెంచారు. కొత్త ప్రతిభను వెండితెరకు పరిచయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన, ఇటీవల ‘తిమ్మరాజుపల్లి టీవీ’తో ప్రొడక్షన్లోకి అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ జోరును కొనసాగిస్తూ, తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్న రెండో చిత్రం ‘హతః’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అనుష్ గోరాక్ దర్శకత్వంలో వినూత్న కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ‘హతః’ టీజర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, టీజర్‌తోనే సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తించింది. కథలోని మిస్టరీ, పాత్రల తీరు చాలా కొత్తగా కనిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో కుష్లు మద్దాల, రెహ్మాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టస్వామి ప్రధాన పాత్రలు పోషించారు. కొత్త తారలతోనే బలమైన కంటెంట్‌ను నమ్ముకుని కిరణ్ అబ్బవరం ఈ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషం. కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకు సరైన వేదిక పండగ సీజన్లే అని భావించిన చిత్ర యూనిట్, ఈ సినిమా విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. అన్ని హంగులు పూర్తి చేసుకుని దీపావళి కానుకగా నవంబరు 6న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హీరోగా బాక్సాఫీస్ వద్ద రాణిస్తూనే, మంచి కథలను నమ్ముతూ కొత్త దర్శకులకు అండగా నిలుస్తున్న కిరణ్ అబ్బవరం నిర్మాణ ప్రయత్నం ఈ చిత్రంతో ఏ మేరకు విజయవంతం అవుతుందో చూడాలి.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!