Divya- Arnav Case: కోలీవుడ్ సీరియల్ నటి దివ్య- అర్ణవ్ కేసులో రోజురోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. రహస్యంగా పెళ్లి చేసుకొని వేరొక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది దివ్య.. ఇక దీంతో పోలీసులు అతనికి విచారించగా తన భార్యకు మతిస్థిమితం లేదని చెప్పి షాక్ ఇచ్చాడు. ఇక ఈ కేసులో వాదోపవాదాలు జరుగుతున్న నేపథ్యంలో మొన్నటికి మొన్న వేరొక నటి అన్షితతో దివ్య మాట్లాడిన ఆడియో కాల్ లీక్ అయిన విషయం విదితమే.. దివ్య ముందే అన్షిత, అర్ణవ్ కు ఐ లవ్ యూ చెప్పి ముద్దుల మీద ముద్దులు ఇచ్చింది. ఇక దీంతో దివ్య.. ఆమెను చంపేస్తానని బెదిరించింది. అదొక పెద్ద ట్విస్ట్ అనుకొంటే.. తాజాగా మరో ట్విస్ట్ బయటికి వచ్చింది.. అర్ణవ్ తన భర్త అంటూ ట్రాన్స్ జెండర్ ప్రియదర్శిని మీడియా ముందుకు రావడంతో కోలీవుడ్ మొత్తం షాక్ గురైంది.
ప్రియదర్శిని, అర్ణవ్ గురించి మాట్లాడుతూ ” నాకు, అర్ణవ్ కు టీ నగర్ లో పరిచయం అయ్యింది.. కొద్దిరోజులు మాట్లాడుకున్న మా మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ కాస్తా పెళ్ళికి దారితీసింది. ఒక గుడిలో రహస్యంగా ఇద్దరం పెళ్లి చేసుకొని కాపురం పెట్టాం.. కొన్ని రోజులు అంతా బాగా గడిచింది. అయితే ఎప్పుడైతే అతడికి దివ్యతో పరిచయమైందో మా మధ్య విబేధాలు తలెత్తాయి. అతడిలో ఇంకో యాంగిల్ చూసాను.. అతడు పెద్ద సైకో. నన్ను తీవ్రంగా కొట్టేవాడు.. దివ్యతో సంబంధం పెట్టుకోవడానికి నన్ను వదిలించుకున్నాడు” అని చెప్పుకొచ్చింది. ఆమె నుంచి విడిపోయాక అర్ణవ్, దివ్యను పెళ్లాడాడు. ఇప్పుడు అన్షితతో సంబంధం పెట్టుకోని దివ్యను వేధిస్తున్నాడు. మరి ఈ ట్విస్టుల మధ్యలో ఈ కేసును పోలీసులు ఎలా ఒక కొలిక్కి తీసుకొస్తారో చూడాలి.