Tamannah : మిల్కీ బ్యూటీ తమన్నాకు ఉన్న మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమె అందాల కోసమే థియేటర్లకు వెళ్లే అభిమానులు కూడా ఉన్నారు. అలాంటి తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చాక ఓ రూల్ పెట్టుకుంది. తాను ఎవరికీ లిప్ లాక్ ఇవ్వొద్దని ఓ కండీషన్ తోనే సినిమాలు చేసింది. కానీ ఆ రూల్ ను ఇన్నేళ్ల తర్వాత రీసెంట్ గానే బ్రేక్ చేసింది. అప్పట్లో స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ గా చేసిన సామ్ జామ్ అనే ప్రోగ్రామ్ కు తమన్నా గెస్ట్ గా వచ్చింది. అందులో చాలా విషయాలను పంచుకుంది. తమన్నా లిప్ లాక్ రూల్ ను ఎప్పుడు బ్రేక్ చేస్తావ్.. ఎవరికి ఇస్తావ్ అని సమంత అడిగింది. దానికి తమన్నా.. విజయ్ దేవరకొండతోనే లిప్ లాక్ చేస్తా అంటూ తెలిపింది. దాంతో విజయ్ పేరు అప్పట్లో మార్మోగిపోయింది. కానీ విజయ్ దేవరకొండతో ఇప్పటికీ ఆమె లిప్ లాక్ ఇవ్వలేదు.
Read Also : Meena : విడాకులు తీసుకున్న వాళ్లందరితో నాకు పెళ్లి చేసేశారు..
కానీ విజయ్ వర్మకు మాత్రం లిప్ లాక్ ఇచ్చింది. ఇద్దరి పేరులో విజయ్ ఉంది. వీరిద్దరూ కలిసి నటించిన లస్ట్ స్టోరీస్-2లో ఫస్ట్ టైమ్ తమన్నా లిప్ లాక్ ఇచ్చింది విజయ్ వర్మకు. దాంతో ఆమె నిజంగానే అన్నంత పని చేసేసిందంటూ కామెంట్లు వచ్చాయి. ఎందుకంటే ఆమె విజయ్ తో లిప్ లాక్ చేస్తా అని చెప్పి.. విజయ్ పేరున్న నటుడికే ఇచ్చింది కదా అంటూ కామెంట్లు చేశారు నెటిజన్లు. వీరిద్దరూ అప్పట్లో పీక్స్ డేటింగ్ లో ఉన్నారు. ఏమైందో తెలియదు గానీ.. ఇద్దరూ బ్రేకప్ చెప్పేసుకుని ఎవరి దారుల్లో వారు బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం తమన్నా డూ యూ వాన్న పార్ట్ నర్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. అది ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ తో తమన్నాకు మంచి క్రేజ్ వస్తోంది. వరుసగ ఐటెం సాంగ్స్, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ.
Read Also : Bigg Boss-9 : ఆ కంటెస్టెంట్ కు పాజిటివ్ వైబ్స్.. విన్నర్ అయ్యే ఛాన్స్..?