ఏపీలో గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో వెంకటేష్ నాయుడు పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు సీహెచ్ వెంకటేశ్ నాయుడు (ఏ-34)గా ఉన్నాడు. లిక్కర్ స్కాం సొమ్ము దాచిపెట్టిన ఒక డెన్‌లో వెంకటేశ్ నాయుడు నోట్ల కట్టల్ని లెక్కిస్తున్న వీడియో ఒకటి కొద్దీ రోజులుగా సొషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వెంకటేష్ నాయుడు అటు పొలిటికల్ నాయకులతో మాత్రమే కాకుండా సినీ తారలతో కూడా పరిచయాలున్నట్టు తెలుస్తోంది.
Also Read : Tollywood : సినిమా షూటింగ్స్ బంద్.. ఈ భారీ సినిమాల పరిస్థితి ఏంటి?
వెంకటేష్ నాయుడు గతంలో హాట్ బ్యూటీ తమన్నాను ప్రత్యేక సెక్యూరిటీ కలిగిన వాహనాల సదుపాయం కలిగించి, ఆమెతో కలిసి స్పెషల్ జెట్ లో ప్రయాణించారు. అసలు తమన్నాకు వెంకటేష్ నాయుడు మధ్య సంబంధం ఏంటి అని టాలీవుడ్ సర్కిల్స్ లో గుసగసలాడుకుంటున్నారు . ఇలాంటివి హీరోయిన్ కెరీర్ కు నష్టం కలిగిస్తాయని చర్చించుకుంటున్నారు. బాలీవుడ్ లో హీరోయిన్స్ కు ఖరీదైన వాచ్ లు, స్పెషల్ జెట్ లో తిప్పుతూ వార్తల్లో నిలిచాడు సుఖేష్ చంద్రశేఖర్. ఇతగాడు ఏకంగా శ్రీలంక బ్యూటీ బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వీలైన్ ఫెర్నాండేజ్ కు స్పెషల్ జెట్ ను కూడా కానుకగా ఇచ్చి వార్తల్లో నిలిచి ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్నాడు. అతగాడి కారణంగా జాక్విలిన్ కెరీర్ కూడా పోయింది. సినీ తారలు ప్రయివేట్ వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటె అంత మంచిదని తమన్నా వంటి స్టార్ హీరోయిన్ కు ఇంకా మంచిదని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.