Tamannaah : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. ఇటు తమన్నా కూడా పాన్ ఇండియా స్థాయిలో వరుసగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ దుమ్ములేపుతోంది. ఆమె ఒక్కో సాంగ్ కోసం కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటోంది. అయితే స్పెషల్ సాంగ్స్ అంటే కచ్చితంగా డ్యాన్స్ కుమ్మేయాలి. ఈ విషయంలో తమన్నాకు ఢోకా లేదు. అయితే తాను ఇలా డ్యాన్స్ చేస్తూ ఇన్ని సాంగ్స్ చేయడానికి అల్లు అర్జున్ కారణం అని తెలిపింది తమన్నా. బ్రదీనాథ్ సినిమాకు ముందు తమన్నాకు పెద్దగా డ్యాన్స్ చేసే అవకాశాలు రాలేదంట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పింది. బద్రీనాథ్ లో బన్నీ తనకు డ్యాన్స్ చేసే అవకాశం ఇచ్చాడని తెలిపింది.
Read Also : OG : ఓజీ టికెట్లు కొన్నవాళ్ల పరిస్థితేంటి..?
ఆ సినిమాలో ఫ్లోర్ మూమెంట్స్ కూడా చేస్తానని బన్నీకి చెప్పా. అతను వెళ్లి డైరెక్టర్ తో మాట్లాడి నాకు ఛాన్స్ ఇప్పించాడు. ఆ సినిమాలో బన్నీతో సమానంగా నాకు స్టెప్పులు డిజైన్ చేయించాడు. ఆ మూవీ తర్వాత నాకు బోలెడన్ని సాంగ్స్ చేసే అవకాశాలు వచ్చాయి. అప్పటి నుంచి సాంగ్స్ లో డ్యాన్స్ చేసే అవకాశాలు డైరెక్టర్లు ఇచ్చారు. అవే ఇప్పుడు ఇన్ని స్పెషల్ సాంగ్స్ చేసే అవకాశాలు తీసుకొచ్చాయి. ఇప్పుడు ఇంత సంపాదించినా అదంతా కేవలం బన్నీ ఇచ్చిన ఛాన్స్ వల్లే అంటూ తెలిపింది తమన్నా. ఇంకేముంది ఈ కామెంట్లు బన్నీ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు సౌత్ లోనూ స్పెషల్ సాంగ్స్ చేస్తూ దూసుకుపోతోంది.
Read Also : Priya Shetty : ఇందుకే బిగ్ బాస్ కు వద్దన్నాం.. ప్రియాశెట్టి పేరెంట్స్ ఎమోషనల్