Thamannah : మిల్కీ బ్యూటీ తమన్నా ఈ నడుమ మోటివేషన్ కోట్ లు పోస్టు చేస్తోంది. మరీ ముఖ్యంగా విజయ్ వర్మతో బ్రేకప్ అయిన తర్వాత ఆమె చేస్తున్న పోస్టులు అందరికీ ఆశ్చర్యంగానే అనిపిస్తున్నాయి. రీసెంట్ గా విజయ్ వర్మ దంగల్ బ్యూటీ ఫాతిమా సనాషేక్ తో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై విజయ్ స్పందించకపోవడంతో అవి మరింత ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి టైమ్ లో తమన్నా నమ్మకం మీద షాకింగ్ పోస్ట్ పెట్టేసింది. నమ్మకం అంటే ఎలా ఉండాలో చెప్పింది.
Read Also : Rashmika : అనుష్క, కీర్తి సురేష్ బాటలో రష్మిక..!
కొన్ని డిజైన్ లలో తెల్ల రంగు ఎక్కువగా కనిపించవచ్చు. అలా అని దాన్ని తప్పుపట్టొద్దు. దాని వెనకాల వేరే కారణం ఉండొచ్చు. అన్ని సార్లు మనం అనుకున్నవి అన్నీ జరగకపోవచ్చు. కానీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రతి అంగుళం మనం పూర్తి చేయకపోవడం కూడా నిజమైన విశ్వాసమే అవుతుంది అంటూ ఓ సందేశాత్మక పోస్టు చేసింది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం తమన్నా రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది.
Read Also : Priyanka Chopra : ప్రియాంకచోప్రాకు అంత సీన్ లేదు.. మాజీ ప్రపంచసుందరి కామెంట్స్