ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ తాప్సీ పన్ను. పాల మీగడ లాంటి దేహంతో కనువిందు చేసిన ఈ బ్యూటీ ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందిపుచ్చుకొని స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక గత కొంతకాలం నుంచి అమ్మడు బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది. బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినీలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ఈ భామ తెలుగు సినిమాలను తగ్గించేసింది. ఇక చాలా ఏళ్లు తరువాత తాప్సీ నటిస్తున్న తెలుగు చిత్రం మిషన్ ఇంపాజిబుల్. స్వరూప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 1 న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో తాప్సీ మాట్లాడుతూ తెలుగు సినిమాలు తగ్గించడానికి కారణం చెప్పింది. ” ఈ వేడుకకు విచ్చేసిన ప్రతిఒక్కరికి, ముఖ్యంగా చిరంజీవి గారికి థాంక్స్ చెప్తున్నాను..ఆయన నా మొదటి సినిమా ఝుమ్మంది నాదం సినిమా ఆడియో లాంచ్ కి కూడా ఆయనే అతిధిగా విచ్చేశారు. ఆ సినిమా నాకు ఎంతో స్పెషల్.. ఇప్పుడు ఈ సినిమా ఎంతో స్పెషల్.
ఘాజీ తరువాత ఇలాంటి స్పెషల్ అప్పీయరెన్స్ ఫిల్మ్ ఇచ్చినదుకు నిర్మాత నిరంజన్ గారికి థాంక్స్.. ఇక స్వరూప్ కి చాలా చాలా థాంక్స్ చెప్పాలి.. నా డేట్స్ వలన ఎన్ని ప్రాబ్లెమ్స్ వచ్చినా, ట్రావెల్ ప్రాబ్లమ్స్ వచ్చినా పట్టించుకోకుండా నాకు కోపరేట్ చేసి షూటింగ్ కంప్లీట్ చేసినందుకు.. ఇక ఈ సినిమాకు మెయిన్ పిల్లర్స్ ముగ్గురు చిన్నారులు భాను, జయ, రోషన్.. వీరికి మంచి ఫ్యూచర్ ఉంది.. ఈ సినిమాలో నేను కాదు.. మీరే హీరోలు.. మీరు పెద్దవాళ్లు అయ్యి, స్టార్ హీరోలుగా మారితే నాకొక అవకాశం ఇవ్వండి. ఇక ఈ మధ్య అందరు అడుగుతున్నారు.. తెలుగు సినిమా ఎందుకు చేస్తావ్ అని.. దానికి నా దగ్గర పర్టిక్యులర్ ఆన్సర్ లేదు.. గత రెండేళ్ల నుంచి హిందీ సినిమాలతో బిజీగా ఉన్నాను.. అంతే తప్ప ఇందులో లాజిక్ గా చెప్పే కారణం లేదు. ఎందుకంటే మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో అది మనకు చాలా స్పెషల్ ఉంటుంది. నాకు తెలిసి మాటలు కన్నా చేతలు ఎక్కువ శబ్దాన్ని చేస్తాయి. నేను అప్పుడు తెలుగు సినిమాలు చేశాను.. ఇప్పుడు తెలుగు సినిమాలు చేస్తున్నాను.. ముందుముందు కూడా తెలుగు సినిమాలు చేస్తాను” అని చెప్పుకొచ్చింది.