ఝుమ్మంది నాదం చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ తాప్సీ పన్ను. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. సౌత్‌లో గ్లామర్ హీరోయిన్ గా తెచ్చుకున్నా పేరు నార్త్ల్‌లో మాత్రం తాప్సీ ఎక్కువగా స్ట్రాంగ్ రోల్స్‌లోనే కనిపించింది. ‘ముల్క్, బద్‌లా, తప్పడ్’ లాంటి సీరియస్ స్టోరీస్‌తో సెపరేట్ ఇమేజ్ తెచ్చుకొని సూపర్ హీరోయిన్ అని అనిపించుకుంది. ఇక ముందు ముందు కూడా ఇలాగే అనిపించుకోవడం కోసం ఈ బ్యూటీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాదట. ఈ పేరుని చెడగొట్టుకోకూడదని గ్లామర్ రోల్స్‌కి దూరంగా ఉండాలనుకుంటోందట తాప్సీ. ఒకప్పుడు అందాల ఆరబోత చేసిన అమ్మడు ఇప్పుడు స్కిన్ షో కి నో చెప్తోంది అంట. ఇక అమ్మడు సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ బికినీ ఫోటోలు పోస్ట్ చెయ్యనని చెప్పేస్తోంది అని టాక్. అయితే ఇందుకు కారణం కూడా లేకపోలేదు.
తాప్సీ స్కిన్ షో చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టినవే.. దీంతో స్కిన్ షో అమ్మడికి అచ్చిరాలేదని గుర్తించి, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూనే మంచి గుర్తింపు తెచ్చుకొంటానని చెప్పుకొస్తుంది. ఇక తాప్సీ ప్రస్తుతం ఏడు సినిమాలతో బిజీగా ఉంది. హిందీలో అనురాగ్ కశ్యప్‌తో ‘దొబారా’ సినిమాతో పాటు హైదరాబాదీ క్రికెటర్ మిథాలీరాజ్ బయోపిక్ ‘షబాష్ మీథూ’ చేస్తోంది. అలాగే ‘బ్లర్, ఓ లడఖీ హే కహా’ సినిమాల్లో నటిస్తోంది. వీటితోపాటు తమిళ్లో రెండు సినిమాలు, తెలుగులో ‘మిషన్ ఇంపాజిబుల్’ చేస్తోంది. ఈ సినిమాల్లో ఎక్కడా స్కిన్ షో తో అవసరం రాదు. అయితే తాప్సీ డెసిషన్ పై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందాల ముద్దుగుమ్మ అందాలను మిస్ అవుతామని,. కనీసం సోషల్ మీడియాలో అయినా హాట్ ఫొటోస్ తో దర్శనం ఇవ్వాలని కోరుకుంటున్నారు. మరి అభిమానుల కోరిక తాప్సీ తీరుస్తుందా..? లేదా అనేది చూడాలి.
