Taapsee Pannu Again Made Sensational Comments South Film Industry: బాలీవుడ్‌కి చెక్కేసిన తర్వాత కొందరు భామలు సౌత్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే! సౌత్‌లో హీరోయిన్లను గ్లామర్ డాల్‌గా చూస్తారే తప్ప, అక్కడ తగిన గౌరవం లేదంటూ ఎందరో కథానాయికలు గతంలో వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. నటి తాప్సీ పన్ను కూడా అందుకు మినహాయింపు కాదు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచే తన సినీ ప్రస్థానం ప్రారంభించి, స్టార్ హీరోయిన్‌గా ఎదిగి, ఆ స్టార్డమ్‌తోనే బాలీవుడ్‌లో అడుగుపెట్టాక ఒక్కసారిగా యూ-టర్న్ తీసుకుంది. టాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుపై కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అప్పుడు తెలుగు ప్రేక్షకుల నుంచి తాప్సీకి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చిపడింది. ఆమెను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు.
Teja Sajja: ‘హను-మాన్’కు గుమ్మడికాయ కొట్టేసిన ప్రశాంత్ వర్మ!
అయినా సరే.. తాప్సీలో ఏమాత్రం మార్పు రానట్టుంది. అందుకే, మరోసారి ఈ అమ్మడు సౌత్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. సౌత్ ఇండస్ట్రీలో నటించిన చిత్రాల వల్ల తనకు స్టార్డమ్ వచ్చిన మాట వాస్తవమే కానీ, నటిగా సంతృప్తి దొరకలేదని బాంబ్ పేల్చింది. అందుకే తాను బాలీవుడ్‌పై దృష్టి పెట్టానని.. ‘పింక్’ సినిమా తన కెరీర్‌లో గొప్ప మలుపు అని వెల్లడించింది. బాలీవుడ్‌లో స్టోరీల ఎంపికలో తాను తీసుకున్న నిర్ణయాలు తనకు చక్కని ఫలితాలు ఇచ్చాయని చెప్పింది. తన సినిమా చూసేందుకు థియేటర్లకు వచ్చే ఆడియెన్స్.. డబ్బులతో పాటు సమయాన్ని వృధా చేసుకున్నామని అనుకోకూడదని తెలిపింది. తన స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదని స్థాయికి చేరుకోవడమే తన లక్ష్యమని పేర్కొంది. ఇప్పుడు తాను చాలా సంతృప్తిగా ఉన్నానని, తన ఫిల్మోగ్రఫీలో గొప్పగా చెప్పుకునే సినిమాలు తాను చేశానంది. బాలీవుడ్‌లో అడుగుపెట్టి పదేళ్లు పూర్తైన సందర్భంగా.. తాప్సీ ఈమేరకు వ్యాఖ్యలు చేసింది.
Nitish Rana – Hrithik Shokeen: ఆ ఇద్దరికి బీసీసీఐ షాక్.. ఫీజులో కోత