ఇప్పటి వరకూ మ్యూజిక్ అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్ లో ఉన్న టీ-సీరిస్ సంస్థ త్వరలో భారీ స్థాయిలో ఓటీటీ కంటెంట్ ను అందించే ప్రయత్నం చేయబోతోంది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వినోదం ప్రజల చేతి మునివేళ్ళలోనే స్మార్ట్ ఫోన్ రూపంలో లభ్యం అవుతోందని, దానిని దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాల వారిని అలరించేలా ఓటీటీ కంటెంట్ ను రూపొందించాలనే నిర్ణయం తీసుకున్నామని టీ-సీరిస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ తెలిపారు.
Read Also : తలైవా కంటే ఎక్కువ ఫాలోయింగ్… సౌత్ లో అత్యధికంగా ఫాలో అవుతున్న స్టార్
ఈ వివరాలను ఆయన తెలియచేస్తూ, ”కథాబలంతో పాటు సంగీత ప్రధానమైన చిత్రాలు తప్పనిసరిగా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తాయనే నమ్మకం మొదటి నుండి మాకు ఉంది. ఆ దిశగానే చిత్ర నిర్మాణం జరిపాం. యూ ట్యూబ్ లో మా కంటెంట్ ను వీక్షకలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. అయితే ఇప్పుడు మారిన కాలమన పరిస్థితులలో స్టోరీబేస్డ్ వెబ్ సీరిస్ ను తయారు చేసి ఓటీటీల ద్వారా అందించాలని అనుకుంటున్నాం. ఇందు కోసం ఆనంద్ ఎల్. రాయ్, అనుభవ్ సిన్హా, నిఖిల్ అద్వానీ, హన్సల్ మెహతా, సంజయ్ గుప్తా, బిజోయ్ నంబియార్, సుపర్న్ ఎస్ వర్మ, మిఖిల్ ముసాలే, సౌమేంద్ర పథి వంటి ప్రముఖులతో చర్చలు జరుపుతున్నాం. వారంతా ఓటీటీ కంటెంట్ ఇవ్వడానికి అంగీకారం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులను దృష్టిలో ఉంచుకుని వీరితో ఓరిజినల్, ఎక్స్ క్యూజీవ్ స్టోరీస్ ను రూపొందిస్తాం.
ఇందులో యాక్షన్ థ్రిల్లర్స్, బయోపిక్స్, మర్డర్ మిస్టరీస్, జైల్ బ్రేక్ డ్రామాస్ లాంటి వాటిని సినిమాలు, వెబ్ షోస్, వెబ్ సీరిస్ ద్వారా త్వరలోనే తీసుకొస్తాం” అని అన్నారు. తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ 2025 నాటికి ఆప్టిక్ ఫైబర్ ద్వారా దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు సైతం 5జీ స్పెక్ట్రమ్ ను వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పిన నేపథ్యంలో ఓటీటీ మార్కెట్ కు గణనీయమైన ఆదరణ పల్లె ప్రాంతాల నుండి కూడా లభిస్తుందనే ఆశాభావాన్ని భూషణ్ కుమార్ వ్యక్తం చేస్తున్నారు.