దళపతి విజయ్ కి కోలీవుడ్ ఉన్న మార్కెట్ మరే హీరోకి లేదు అని చెప్పడం అతిశయోక్తి కాదు. రజినీకాంత్ తర్వాత ఆ స్థాయి మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ హీరో రీజనల్ సినిమాలతో పాన్ ఇండియా సినిమాల రేంజ్ కలెక్షన్స్ ని అవలీలగా తెస్తుంటాడు. విజయ్ లాస్ట్ సినిమా ఫామిలీ డ్రామా జానర్ లో తెరకెక్కినా కూడా 300 కోట్లు కలెక్ట్ చేసింది అంటే విజయ ఫాలోయింగ్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. డైరెక్టర్, బ్యానర్, కథ అనే విషయాలతో సంబంధం లేకుండా పోస్టర్ పైన విజయ్ కనపడితే చాలు కాసుల వర్షం కురిపించడానికి ఫాన్స్ రెడీగా ఉన్నారు. సింపుల్ గా చెప్పాలి అంటే విజయ్ కెరీర్ కే ఇది గోల్డెన్ ఫేజ్ లాంటిది. ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చెయ్యకుండా ఇండియా వైడ్ తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడం విజయ్ కి మాత్రమే చెల్లింది. ఎంత స్టార్ హీరో అయినా సింపుల్ గా ఉండే విజయ్ పుట్టిన రోజు జూన్ 22న గ్రాండ్ గా చెయ్యడానికి తమిళనాట భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో విజయ్ చేస్తున్న ‘లియో’ సినిమా నుంచి ‘నా రెడీ’ సాంగ్ జూన్ 22నే రిలీజ్ కానుంది. అనిరుద్ ఇచ్చిన ఈ సాంగ్ టాప్ ట్రెండ్ అవ్వడం గ్యారెంటీ. జూన్ 22నే విజయ్-వెంకట్ ప్రభు కాంబినేషన్ లో ఇటీవలే అనౌన్స్ అయిన కొత్త సినిమా నుంచి మోషన్ పోస్టర్ అండ్ టైటిల్ అనౌన్స్మెంట్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ రెండు అప్డేట్స్ బయటకి వస్తే సోషల్ మీడియా మొత్తం విజయ్ పేరుతో మారుమోగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రెండు సినిమాల నుంచి కాకుండా కొత్త అనౌన్స్మెంట్ లు స్వీట్ షాక్ ఇస్తూ విజయ్ నుంచి బయటకి వస్తాయేమో చూడాలి. విజయ్ సినిమాలకి ఎండ్ కార్డ్ వేసి పాలిటిక్స్ లోకి వెళ్తాడు అనే మాట వినిపిస్తుంది కాబట్టి అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తాడేమో అని కోలీవుడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మరి విజయ్ నుంచి ఎలాంటి సర్ప్రైజ్ వస్తుందో చూడాలి.