సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట మే 12 న రిలీజ్ కానున్న విషయం విదితమే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో ఘనంగా జరుగుతున్నా విషయం విదితమే. ఇప్పటికే ఈ వేడుక మహేష్ ఫ్యాన్స్ తో జనసందోహంగా మారింది. ఇక తాజాగా మహేష్ బాబు ఈ వేడుకకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయనతో పాటు ప్రముఖ దర్శకుడు సుకుమార్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా విచ్చేశారు. ఇక మహేష్ బాబు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు అనడంలో అతిశయోక్తి లేదు. కనకాంబరం కలర్ షర్ట్ లో మహేష్ వింటేజ్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.