Suryadevara Nagavamsi: సూర్యదేవర నాగవంశీ.. ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్న పేరు. పేరు గట్టిగా వినిపిస్తుంది కదా అని హీరోనో, డైరెక్టరో అనుకోకండి.. ఆయనొక నిర్మాత. ఇప్పటివరకు ఒక నిర్మాత ప్రమోషన్స్ లో పాల్గొన్నది చాలా తక్కువ. కానీ వంశీ మాత్రం ప్రతి ప్రమోషన్స్ లో హీరో కన్నా ఎక్కువ కనిపిస్తాడు. సినిమాకు ఏదైనా ప్రాబ్లెమ్ వస్తే నిర్మొహమాటంగా మీడియా ముందు చెప్పేస్తాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో సగానికి పైగా సినిమాలు వంశీ చేతిలోనే ఉన్నాయి. ఇక రేపు రిలీజ్ అవుతున్న మ్యాడ్ సినిమాను కూడా సూర్యదేవర హారిక .. అంటే వంశీ అన్న కూతురు నిర్మించిందే. ప్రమోషన్స్ చిత్ర బృందం కన్నా, వంశీనే ఎక్కువ చేస్తున్నాడు. వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు ఇస్తూ.. తమ తదుపరి సినిమాల గురించి చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్ లో గుంటూరు కారం రిలీజ్ కు రెడీ గా ఉంది. ఇక ఈసినిమా గురించి వంశీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. గుంటూరు కారం చుట్టూ ఇన్ని వివాదాలు ఎందుకొస్తున్నాయో తనకే తెలియదని చెప్పుకొచ్చాడు.
Keerthi Reddy : రీ ఎంట్రీ కి సిద్ధం అవుతున్న పవన్ హీరోయిన్..?
” గుంటూరు కారం మొదలైనప్పటి నుంచి దాని చుట్టూ ఇన్ని వివాదాలు ఎందుకు” అన్న ప్రశ్నకు నాగవంశీ మాట్లాడుతూ.. “మహేష్ బాబు గారు ఎప్పుడు మీడియాతో మాట్లాడరు.. డైరెక్టర్ త్రివిక్రమ్ ఎప్పుడు మీడియాతో మాట్లాడరు.. వారిద్దరి మధ్య కాంట్రవర్సీలు ఉండవు.. ఇక నేను సినిమా టైమ్ లో ప్రమోషన్స్ తప్ప మీడియా ముందుకు రాను. మరి.. ఎందుకు మా మీద అంత ప్రేమ..? అసలు మా బాబాయ్ అయితే మీడియాలోకే రారు. ఇక సోషల్ మీడియా లీక్స్ వచ్చినా.. గుంటూరుకారంలో జరగనిది ఏదైనా జరిగిందా.. పూజా హెగ్డేను రీప్లేస్ చేశారు. కానీ, దాన్ని యేమని చెప్పారు. పూజను తీసేశారు.. ఆమెను ఎందుకు తీసేస్తాం. ఆమె మా ఇంటి అమ్మాయిలా ఉంటుంది. అందరికన్నా ఎక్కువ మాకే బాధగా ఉంటుంది.” అని చెప్పాడు. ప్రస్తుతం ఏ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.