Ram Pothineni: హీరోయిన్ అనుపమతో రామ్ పెళ్లి.. ఎవడ్రా చెప్పింది మీకు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Pothineni: చిత్ర పరిశ్రమ అన్నాకా రూమర్స్ కామన్. ఒక హీరో, హీరోయిన్ కలిసి కనిపిస్తే ప్రేమ.. ఎక్కువ సార్లు కనిపిస్తే రిలేషన్.. ఒకరి ఇంట్లో ఒకరు కనిపిస్తే పెళ్లి.. ఇలా నిత్యం వారి చుట్టూ రూమర్స్ సహజీవనం చేస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు ఆ రూమర్స్ పై వాళ్ళు స్పందిస్తారు. ఇంకొన్నిసార్లు అస్సలు స్పందించడం కూడా వేస్ట్ అని వదిలేస్తూ ఉంటారు. ఇక ఎప్పటినుంచో హీరో రామ్ పోతినేని పెళ్లి గురించి ఎన్నో రూమర్స్ వస్తున్న విషయం తెల్సిందే. అప్పుడెప్పుడో.. రామ్ తన చిన్ననాటి స్నేహితురాలిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. అవి ఏ రేంజ్ లో వచ్చాయంటే.. రామ్ కుటుంబ సభ్యులు కూడా రామ్ ను నమ్మలేనంతగా. దీంతో ఈ కుర్ర హీరో స్పందించక తప్పలేదు. దయచేసి ఈ పెళ్లి వార్తలు ఆపండి.. నా కుటుంబ సభ్యులే నన్ను అనుమానిస్తున్నారు. నాకే చిన్ననాటి స్నేహితురాలు లేదు అంటూ రామ్ లబోదిబో అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అప్పటి పెళ్లివార్తలకు ఫుల్ స్టాప్ పడింది.
Pragya Jaiswal: కంచె బ్యూటీ కంచె దాటినా పట్టించుకోరే..
Also Read
ఇక గత కొన్నిరోజులుగా క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశర్వన్ తో రామ్ పెళ్లి అంటూ మరో పుకారు షికారు చేస్తోంది. వీరిద్దరూ కలిసి రెండు సినిమాలు చేశారు. ఉన్నది ఒకటే జిందగీ, హలో గురూ ప్రేమ కోసమే. ఈ రెండు సినిమాలు కూడా ఆశించనంత ఫలితాన్ని అనుకోలేకపోయినా.. వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని టాక్. ఇక ఈ విషయమై వీరిద్దరూ స్పందించలేదు లేదు కానీ, అనుపమ తల్లి సునీత మాత్రం ఘాటుగా స్పందించినట్లు టాక్. అందులో ఎటువంటి నిజం లేదని, ఇలాంటి పుకార్లు ఎక్కడనుంచి వస్తాయో తెలియడం లేదని విసుక్కుందని సమాచారం. అనుపమ ఫోకస్ అంతా కెరీర్ పైనే ఉందని, తనకు పెళ్లి కుదిరితే తామే స్వయంగా చెప్తామని కూడా చెప్పుకొచ్చిందంట. దీంతో అనుపమ ఫ్యాన్స్ .. గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. ఎవడ్రా చెప్పింది మీకు..? అంటూ రూమర్స్ క్రియేట్ చేసిన వారిపై ఫైర్ అవుతున్నారు. అ ఏదిఏమైనా రామ్.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమాలు పూర్తి చేసి ఈ ఏడాది చివర్లోనో.. వచ్చే ఏడాదిలోనో పెళ్లి కబురుచెప్తే బావుంటుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!