తమిళ స్టార్ హీరో సూర్య బ్యాక్ టు బ్యాక్ ప్లాపులతో సతమతమవుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కంగువ డిజాస్టర్ అయింది. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది. ఇక కాస్త గ్యాప్ తీసుకుని కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రెట్రో సినిమా చేసాడు సూర్య. ఇది కూడా ప్లాపుల జాబితాలోకి చేరిపోయింది. దాంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు సూర్య.
Also Read : Vijay 69 : జననాయకుడు ఫస్ట్ రోర్ రిలీజ్..
ప్రస్తుతం RJ బాలాజీ దర్శకత్వంలో ‘కరుప్పు’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రురల్ యాక్షన్ బ్యాక్డ్రాప్ నేపధ్యంలో వస్తున్నఈ సినిమాను కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సూర్య 45ను నిర్మిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ అయింది. జులై 23న సూర్య బర్త్ డే కానుకగా కరుప్పు టీజర్ రిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో సూర్య సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. RJ బాలాజీ గతంలో నయన తార లీడ్ రోల్ లో వచ్చిన అమ్మోరు తల్లి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు. సూర్యతో తెరకెక్కించే సినిమాతో ఫ్యాన్స్ ను హిట్ సినిమా ఇస్తాడని టీమ్ బలంగా నమ్ముతోంది. ఇప్పటికే వరుస ఫ్లోప్స్ తో మార్కెట్ ను కోల్పోయిన సూర్య ‘కరుప్పు’ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన మార్కెట్ ను నిలబెట్టుకోవసిన అవసరం ఎంతైనా ఉంది.