Suriya: కోలీవుడ్ లో ప్రస్తుతం రాజకీయ రణరంగం నడుస్తుంది అని చెప్పొచ్చు. నిన్నటికి నిన్న ఇళయ దళపతి విజయ్.. 10th, 12th తరగతిలో టాపర్స్ గా నిలిచిన విద్యార్థులను కలిసి వారికి పదివేలు బహుమతిగా ఇచ్చాడు. అంతేకాకుండా విద్య ఎంత ముఖ్యమో.. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో చెప్పుకొచ్చి షాక్ ఇచ్చాడు. ఇక విజయ్ కొన్నిరోజులుగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడని, ఆయన కొత్త పార్టీని పెట్టనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో విజయ్.. ఇలా విద్యార్థులను ప్రశంసించడం, ఆ మీటింగ్ లో పాలిటిక్స్ గురించి మాట్లాడడం నెట్టింట వైరల్ గా మారింది. ఆ వ్యాఖ్యలతో విజయ్ పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మ్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఈ పాలిటిక్స్ లోకి వచ్చాక విజయ్ ఇక సినిమాల్లో నటించడు అని, వెంకట్ ప్రభుతో చేసే సినిమానే చివరి సినిమా అని వార్తలు గుప్పుమన్నాయి. వీటిపై విజయ్ అధికారికంగా స్పందించింది లేదు.
Heart Of Stone Trailer: హాలీవుడ్ విలన్ గా అలియా.. అదరగొట్టేసింది అంతే
ఇక విజయ్ లానే మరో స్టార్ హీరో సూర్య కూడా రాజకీయాల్లోకి వస్తున్నాడు..? అంటూ కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. అదేంటంటే.. నిన్న పబ్లిక్ గా విద్యార్థులను విజయ్ ప్రశంసిస్తే..సూర్య ప్రైవేట్ గా వాళ్ళని కలిసి ప్రశంసించాడు. ఎన్నో ఏళ్లుగా సూర్య అగారం అనే ఫౌండేషన్ ను నడుపుతున్న విషయం తెల్సిందే. చదువుకోలేని పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తుంది ఈ ఫౌండేషన్. దీనికోసం సూర్య ఎంతో శ్రమించాడు. ఇప్పటికీ తనకొచ్చే ఆదాయంలో కొంత ఈ ఫౌండేషన్ కే వెళ్తుంది. తాజాగా అగారం ఫౌండేషన్ లో సూర్య విద్యార్థులను కలిసి మాట్లాడాడు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే నిన్ననే విజయ్, సూర్య విద్యార్థులతో మాట్లాడడం చూసి.. సూర్య సైతం రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ వార్తలు గుప్పుమన్నాయి. కానీ, అందులో నిజం లేదని.. సమయం చిక్కినప్పుడల్లా సూర్య అగారం ఫౌండేషన్ విద్యార్థులతో మాట్లాడుతూ ఉంటాడని తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం సూర్య కంగువ సినిమాతో బిజీగా మారాడు. ఈ సినిమా తరువాత మరో రెండు సినిమాలు సూర్య చేతిలో ఉన్నాయి.