Man cuts off mother-in-law’s nose: అత్త ముక్కు కోసేసిన అల్లుడు.. ఆ భాగాన్ని చేతిలో పట్టుకొని పరార్..
- అత్త ముక్కు కోసిన అల్లుడు..
- ముక్కు భాగాన్ని పట్టుకొని పరార్..
- రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో చాలా కాలంగా కుటుంబ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో.. శనివారం ఒక వ్యక్తి తన అత్తగారి ముక్కును కత్తెరతో కోసేశాడు. అంతటితో ఆగకుండాజజ ఆ కోసిన ముక్కు ముక్కను తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో సర్వానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు కైలీ దేవి (52) తన అల్లుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా.. దారిలోనే అల్లుడు సోహన్‌లాల్ ఆమెపై దాడి చేశాడు.
Also Read:Bamruk-ud-Daula lake: హైదరాబాద్‌లో ప్రారంభానికి సిద్ధంగా మరో చెరువు.. సంతోషంలో స్థానికులు..
Also Read
ఆరేళ్ల క్రితం సోహన్‌లాల్‌కు.. కైలీ దేవి కుమార్తె సరితతో పెళ్లయింది. వీరికి గతేడాది కాలంగా గొడవలు జరుగుతున్నాయి. దాంతో సరిత తన భర్తకు దూరంగా పుట్టింటిలోనే ఉంటోంది. ఈ గొడవను పరిష్కరించేందుకు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు పెట్టినా, ఏమీ తేలలేదు.
తన సంసారంలో గొడవలకు అత్తగారే కారణమని, ఆమె తన భార్యను తనకి వ్యతిరేకంగా మారుస్తోందని సోహన్‌లాల్ అనుమానించేవాడు. ఇదే విషయమై శనివారం మధ్యాహ్నం 2 గంటలకే వారి ఇంట్లో గొడవ జరిగింది. ఆ వేధింపులు భరించలేక.. అత్త కైలీ దేవి పోలీసులకు ఫిర్యాదు చేయాలని బయలుదేరింది. ఆ సమయంలోనే అల్లుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.
Also Read:Marriage: ఆడబిడ్డకు అండగా ‘వైద్యుల’ బృందం.. సోషల్ మీడియా పరిచయం పెళ్లి బంధమైన వేళ..
గాయపడిన కైలీ దేవిని ముందుగా సాంచోర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను గుజరాత్‌లోని మెహసానా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు సోహన్‌లాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!