Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viswanath & Sons: ఒక సినిమా థియేటర్లలోకి భారీ వసూళ్లు సాధించడం పెద్ద విషయం కాదు. అయితే కొత్త సినిమాలు వరుసగా విడుదలవుతున్న సమయంలో కూడా అదే జోరును కొనసాగించడం మాత్రం అంత సులభం కాదు. ప్రస్తుతం సూర్య నటించిన ‘విశ్వనాథ్ & సన్స్’ ఇదే తరహా విజయాన్ని అందుకుంటోంది. విడుదలై 16 రోజులు పూర్తయినా ఈ ఫ్యామిలీ డ్రామా బాక్సాఫీస్ వద్ద స్థిరమైన వసూళ్లను కొనసాగిస్తూనే ఉంది. సూర్య కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath & Sons) థియేటర్లలో విడుదలైన 16 రోజులకు అంటే 2026 ఆగస్టు 30 నాటికి ప్రపంచవ్యాప్తంగా ₹240 కోట్ల క్లబ్‌లోకి చేరింది. 2026 ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే ₹100 కోట్లు, మొదటి వారంలోనే ₹200 కోట్ల మార్కును దాటి సంచలనం సృష్టించగా, సూర్య కెరీర్లో ‘కరుప్పు’ తర్వాత ₹240 కోట్ల మార్కును సాధించిన మరో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
సాధారణంగా ఒక సినిమా రెండో వారంలోకి అడుగుపెట్టిన తర్వాత కొత్త సినిమాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ‘విశ్వనాథ్ & సన్స్’ మాత్రం థియేట్రికల్ రన్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వచ్చిన స్పందనతోనే ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీని నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఇందులో సూర్య నటనతో పాటు మమితా బైజు పెర్ఫార్మెన్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ ప్రేక్షకులు సినిమాను ఆదరించడం వల్లే రెండో వారంలో కూడా వసూళ్లు నిలకడగా కొనసాగుతున్నాయని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమా రూ.240 కోట్ల వసూళ్లతో 15 రోజుల తర్వాత కూడా ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడం ఈ సినిమాను ప్రేక్షకులు ఏపాటిగా ఆదరిస్తున్నారో తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ‘విశ్వనాథ్ & సన్స్’ సూర్య కెరీర్లో మరో బాక్సాఫీస్ హిట్ చేరింది. ‘కరుప్పు’ సినిమాతో 300కోట్ల క్లబ్ లో చేరారు సూర్య. విడుదలై 15 రోజులు పూర్తయిన తర్వాత కూడా కొత్త చిత్రాల పోటీని తట్టుకుని రూ.240 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ‘విశ్వనాథ్ & సన్స్’ కూడా ఆ రికార్డుని బ్రేక్ చేస్తుందా ? దారిదాపుల్లో నిలుస్తుందా ? అనేది ఈ వారాంతంలో తేలనుంది.
Also Read
- The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Tags
- cinema
- Viswanath & Sons
తాజావార్తలు
-
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
-
Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
-
The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!