మైటీ వయొలెంట్ వీరుడి కథ చెప్పబోతున్నాం అని అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు పెంచారు సూర్య-శివ. ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మొదటి సినిమా, కోలీవుడ్ నుంచి రాబోతున్న బాహుబలి లాంటి సినిమా ‘కంగువా’. స్టూడియో గ్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న కంగువ సినిమాపై కోలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రానున్న మొదటి వెయ్యి కోట్ల సినిమాగా కంగువా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు ప్రెడిక్ట్ చేస్తున్నాయి. ఆ అంచనాలని నిజం చేస్తూనే కంగువా సినిమా బిజినెస్ భారీగా జరుగుతోంది. ఇటీవలే ఫస్ట్ లుక్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన కంగువా టీం, లేటెస్ట్ గా సూర్య బర్త్ డే కావడంతో గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసారు. యుద్ధ వీరుడిగా సూర్య ఈ గ్లిమ్ప్స్ లో సూపర్బ్ గా ఉన్నాడు. ఇప్పటివరకూ కనిపించని వారియర్ లుక్ లో కనిపించిన సూర్య, పర్ఫెక్ట్ వార్ లార్డ్ లా ఉన్నాడు. గ్లిమ్ప్స్ ని కట్ చేసిన విధానం, బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన వాయిస్ ఓవర్, సూర్య క్యారెక్టర్ కి ఇచ్చిన ఇంట్రో, ఎండ్ లో దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన కంగా, కంగా, కంగువా హమ్మింగ్ గ్లిమ్ప్స్ ని వర్త్ వాచింగ్ గా మార్చాయి.
దగ్గర దగ్గర రెండున్నర నిమిషాల పాటు నిడివితో కట్ చేసిన గ్లిమ్ప్స్ లో లాస్ట్ 20 సెకండ్లు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. సూర్య అంటేనే ఇంటెన్స్ లుక్స్ కి కేరాఫ్ అడ్రెస్, ఇది గుర్తు చేసేలా టైట్ క్లోజ్ లో సూర్య చాలా వయొలెంట్ గా కనిపించాడు. మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్, గ్లిమ్ప్స్ తో కంగువా సినిమాపై అంచనాలు పెంచడంలో సక్సస్ అయిన మేకర్స్ ఇక నుంచి ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచితే రిలీజ్ రోజున బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురవడం ఖాయం. తెలుగులో కంగువా సినిమాని యువీ క్రియేషన్స్, హిందీలో అజయ్ దేవగన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ కారణంగా కంగువా సినిమాకి హ్యూజ్ నంబర్ ఆఫ్ థియేటర్స్ దొరికే అవకాశం ఉంది. మరి శివ అండ్ సూర్య ఇదే హైప్ ని మైంటైన్ చేస్తూ, సినిమాకి పాజిటివ్ టాక్ రాబడతారేమో చూడాలి.
Arms of steel and a heart of gold.
The King Arrives! 👑#GlimpseOfKanguva – For your eyes at 12:01 AM tonight!
Premiering here ▶ https://t.co/fyuu8Hmvbw@Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @StudioGreen2 @kegvraja @UV_Creations @saregamasouth @KanguvaTheMovie… pic.twitter.com/O4QhakNqpp— UV Creations (@UV_Creations) July 22, 2023