Suriya: కుటుంబంతో విడిపోయి ముంబైలో మకాం.. సూర్య ఏమన్నాడంటే.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సూర్యకి తమిళ్ లో ఎంత ఫ్యాన్ బేస్ ఉందో తెలుగులో కూడా అంతే ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. ప్రస్తుతం సూర్య చేతిలో కంగువా, వాడీ వసూల్ సినిమాలు ఉన్నాయి. ఈ రెండు కాకుండా మరో రెండు సినిమాలకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇకపోతే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే సూర్య ఈ మధ్య ముంబైలో తన ఫాన్స్ మీట్ కు హాజరయ్యాడు. ఈ ఫ్యాన్స్ మీట్ లో ఆయన తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలకు కూడా సమాధానాలు ఇచ్చాడు. గత కొన్ని రోజులుగా సూర్య తమిళనాడులో కాకుండా ముంబైలో ఉంటున్న విషయం తెల్సిందే. తండ్రి, తమ్ముడు తో గొడవల వలనే సూర్య కుటుంబంతో విడిపోయి ముంబైలో ఇల్లు తీసుకొని ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి.
Vaishnavi Chaithanya: ‘బేబీ’ బ్యూటీ.. అన్ని ఆ డైరెక్టర్ తోనే.. ?
Also Read
- Nagarjuna: 'చెప్పిన డేట్‌కు రాకపోతే ఎలా?'.. ఆదర్శకుటుంబానికి నాగార్జున సూటి ప్రశ్న!
- Sundeep Kishan: 'కరికాల' నా కెరీర్ బెస్ట్.. సందీప్ కిషన్ బిగ్గెస్ట్ ప్లాన్!
- Indian Cinema: ఇండియన్ సినిమాకు పట్టిన ఈ 'బడ్జెట్ పిచ్చి' ఎవరిని ముంచుతుంది?
- Ranabaali Box Office: 'రణబాలి' సేఫ్ కావాలంటే అన్ని కోట్లు కొల్లగొట్టాల్సిందేనా?
ఇప్పటివరకు సూర్య ఈ వార్తలపై స్పందించింది లేదు. అయితే తాజాగా ఈ ఫ్యాన్స్ మీట్ లో ఈ విషయమై స్పందించాడు. తన తమిళనాడును వదిలి ముంబైలో ఎందుకు ఉంటున్నాడు కారణం చెప్పాడు. ” నేను తమిళనాడును వదలడం లేదు. అదేనా పుట్టిన ఊరు. నేను కుటుంబంతో సహా ముంబై లో ఉండడానికి కారణం మా పిల్లలు. వారి చదువుల కోసం ఇక్కడ ఉండాల్సి వచ్చింది. నేను ఎప్పటికీ తమిళనాడులోనే ఉంటాను. ప్రస్తుతానికి నా కెరియర్లో కొత్తవి నేర్చుకోవాలి అనే తపనతో ఉన్నాను..” అని తెలిపాడు. దీంతో ఆ రూమర్స్ కి చెక్ పడినట్లు అయ్యింది. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
-
OPPO Find X10 Pro Max: 200MP + 200MP + 200MP కెమెరాలతో ఒప్పో ఫైండ్ ఎక్స్10 సిరీస్.. భారత్‌లో లాంచ్ డేట్ ఫిక్స్
-
IND vs WI 5th T20: అర్ష్‌దీప్ స్థానంలో భువీకి ఛాన్స్? ప్లేయింగ్ ఎలెవన్‌పై ఉత్కంఠ
-
CJP protest: సీజేపీకి బిగ్ షాక్.. పోలీసుల అదుపులో అభిజిత్ దీప్కే
-
Kavitha : రైతులను త్యాగం చేయమంటారా? రేవంత్‌పై కవిత ఫైర్.!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!