Supritha: నా పెళ్లి కన్నా ముందు మా అమ్మకి పెళ్ళి చేస్తా
సురేఖ వాణి – సుప్రీత.. ఈ తల్లీకూతుళ్ల మధ్య ఉన్న అనుబంధం గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పక్కర్లేదు, స్నేహితుల్లా కలిసి ఉంటూ, సోషల్ మీడియాలో సందడి చేసే వీరిద్దరి రిలేషన్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. అయితే, తాజాగా తన తల్లి పెళ్లి విషయంలో సుప్రీత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు అందరికీ తెలిసిందే. భర్త మరణం తర్వాత తన కూతురే ప్రపంచంగా బతుకుతున్న సురేఖ కోసం, సుప్రీత ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. సుప్రీత మనసులోని మాట వింటే ఆమెకు తన తల్లిపై ఉన్న ప్రేమ ఎంతటిదో అర్థమవుతుంది. “నేను పెళ్లి చేసుకుని ఒక ఇంటికి వెళ్లేముందే, నా తల్లి జీవితంలో ఒక తోడు ఉండాలని ఆశిస్తున్నాను. ఆమెను అమితంగా ప్రేమించే, గౌరవించే వ్యక్తి ఆమె జీవితంలోకి రావాలి. ఈ విషయంపై ఇప్పటికే నేను మా బంధువులతో కూడా చర్చించాను, వారందరూ కూడా నా నిర్ణయానికి మద్దతుగా నిలిచారు” అని సుప్రీత చెప్పుకొచ్చింది.
Also Read :Hari Teja: బన్నీ కోసం..15 రోజులు అన్నం మానేశా..
Also Read
- NBK - Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్‌గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలే..
- Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
- Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
- Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
అమ్మ రెండో పెళ్లి గురించి సుప్రీత ఆలోచిస్తున్నప్పటికీ, అది కేవలం తన ఇష్టం మాత్రమే కాదని ఆమె స్పష్టం చేసింది. “అమ్మ సంతోషమే నాకు ముఖ్యం. తన నిర్ణయమే తుది నిర్ణయం. నాన్న ఉన్న స్థానాన్ని మరొకరికి ఇవ్వడానికి అమ్మ ఇష్టపడటం లేదు. ఆమె భావాలను నేను గౌరవిస్తాను. తనకి ఇష్టం లేనప్పుడు నేను బలవంతం చేయను. కానీ, జీవితాంతం అమ్మ ఒంటరిగా ఉండకూడదనేదే నా తపన” అని ఆవేదనతో కూడిన ప్రేమను వ్యక్తపరిచింది. నేటి కాలంలో కూడా వితంతువుల రెండో పెళ్లిపై సమాజంలో కొన్ని అపోహలు, విమర్శలు ఉన్నాయి. అయితే వాటన్నిటినీ పక్కన పెట్టి, తన తల్లి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న సుప్రీత నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తల్లికి ఒక మంచి తోడును వెతకాలనే ఒక కూతురి ఆలోచన నిజంగా అభినందనీయం.
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!