సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గత రెండు సినిమాలతో బాకీ పడిన హిట్ ని సొంతం చేసుకోవడానికి హ్యాట్రిక్ సినిమాతో రాబోతున్నారు. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి రీసెంట్ గా ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఈ అనౌన్స్మెంట్ సమయంలో రిలీజ్ చేసిన మాస్ స్ట్రైక్ వీడియో ఘట్టమనేని అభిమానులకి కిక్ ఇచ్చింది. సూపర్ యాక్షన్ పార్ట్, మహేష్ మార్క్ డైలాగ్ డెలివరీ, త్రివిక్రమ్ మార్క్ ఎలివేషన్ ని చూపిస్తూ బయటకి వచ్చిన వీడియో, గుంటూరు కారం సినిమాపై అంచనాలని పెంచింది. బీడీ కాలుస్తూ మహేశ్ బాబు నడుస్తూ వస్తుంటే, మహేష్ ఫాన్స్ వింటేజ్ మహేష్ ని గుర్తు చేసుకున్నారు. నిమిషమున్నర ఉన్న వీడియోతో ఈ రేంజ్ బజ్ క్రియేట్ చెయ్యడం మహేశ్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ కే చెల్లింది.
శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ 2024 సంక్రాంతికి రిలీజ్ అవుతుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసారు. షూటింగ్ లో డిలే అవుతుంది కాబట్టి అది రిలీజ్ డేట్ పైన కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. తాజాగా మహేష్ ఫ్యామిలీతో కలిసి మూడు వారాల వెకేషన్ ని వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వెకేషన్ అయిపోయే వరకూ గుంటూరు కారం షూటింగ్ కి బ్రేక్ వేస్తారా లేక ఇతర ఆర్టిస్టులతో షూటింగ్ చేసేస్తారా అనేది తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుండడంతో ఘట్టమనేని అభిమానులు… ఇది ఎప్పుడూ జరిగేదే కదా అంటూ సైలెంట్ అవుతున్నారు. మరి మహేశ్ ఫారిన్ ట్రిప్ ఎప్పుడు కంప్లీట్ చేసుకోని వస్తాడు అనేది చూడాలి.