సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై సాలిడ్ బజ్ ఉంది. అతడు, ఖలేజా సినిమాలతో ఆశించిన రేంజ్ హిట్ ఇవ్వకపోయినా సూపర్బ్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్నారు. అందుకే ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ కోసం ఘట్టమనేని అభిమానులు ఎప్పటినుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ గుంటూరు కారం సినిమా సెట్స్ పైకి వెళ్లింది. పూజా హెగ్డే, శ్రీలీలా హీరోయిన్స్ గా నటిస్తున్నారు కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పూజా హెగ్డే ‘గుంటూరు కారం’ సినిమా నుంచి తప్పుకుంది అనే వార్త వినిపిస్తోంది. మేకర్స్ నుంచి అఫీషియల్ క్లారిటీ లేదు కానీ పూజ ప్లేస్ లో మీనాక్షి చౌదరి వచ్చినట్లు టాక్. ఈ విషయంపై త్వరలో అనౌన్స్మెంట్ వస్తుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గుంటూరు కారం లేటెస్ట్ షెడ్యూల్ శంకరపల్లి దగ్గరలోని జనవాడాలో మొదలయ్యింది. మూడు నాలుగు రోజులు మాత్రమే జరగనున్న ఈ షెడ్యూల్ కోసం భారీ సెట్ వేశారు.
దాదాపు నెల రోజుల తర్వాత గుంటూరు కారం షూటింగ్ అలా స్టార్ట్ అయ్యిందో లేదో ఇలా సోషల్ మీడియాలో లీకులు బయటకి వచ్చేసాయి. మహేష్ బాబు చిన్నప్పటి వాల్ ఫొటోస్, శ్రీలీలా-మహేష్ బాబు ఉన్న ఇంకో ఫోటో ఫ్రేమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గుంటూరు కారం సినిమాకి లీకులు కొత్తేమి కాదు షూటింగ్ స్టార్ట్ అయిన రోజు నుంచి లీకులు బయటకి వస్తూనే ఉన్నాయి. మహేష్ బాబు హెడ్ స్కార్ఫ్ కట్టుకున్న ఫోటో, బీడీ తాగుతున్న ఫోటో… ఇలా రకరకాల స్టిల్స్ షూటింగ్ స్పాట్ నుంచి బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మేకర్స్ ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే గుంటూరు కారం షూటింగ్ స్పాట్ నుంచి ముందు ముందు మరిన్ని లీకులు బయటకి వచ్చే ప్రమాదం ఉంది.
Guntur Kaaram 1