సౌత్ నుంచి స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఎప్పటికప్పుడు భారీ బడ్జట్ తో, స్టార్ డైరెక్టర్ తో సినిమాలు సెట్ చేసుకోని నార్త్ మార్కెట్ ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. టైర్ 2 హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న కాలంలో రీజనల్ మార్కెట్ కే పరిమితం అయ్యి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే. స్టార్ డైరెక్టర్స్ తో సినిమా చేస్తున్నానా లేక భారీ బడ్జట్ సినిమా చేస్తున్నానా ఈ రెండు కాదు పాన్ ఇండియా సినిమా చేస్తున్నానా అనే లెక్కలు లేవు మహేష్ సినిమా చేస్తున్నాడు అంతే… అది రీజనల్ బాక్సాఫీస్ దగ్గర పాన్ ఇండియా రికార్డ్ ని క్రియేట్ చెయ్యాల్సిందే. మహేష్ లాస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ రీజన్ కైనా రికార్డ్ గా నిలిచింది.
ఆ రేంజ్ ఓపెనింగ్స్ మహేష్ రాబట్టింది స్టార్ డైరెక్టర్ తో కాదు, సూపర్ హిట్ కంటెంట్ తో అంత కన్నా కాదు. సర్కారు వారి పాట సినిమా యావరేజ్ కానీ కలెక్షన్స్ మాత్రం యావరేజ్ కాదు. అంతటి ఫాలోయింగ్ ఉన్న మహేష్ బాబు రేంజ్ ఏంటో చూపించింది అనిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్. రణబీర్ కపూర్ లాంటి స్టార్ హీరో… జై బాబు అనే నినాదం చేసాడు అంటే ఈవెంట్ లో మహేష్ ఫ్యాన్స్ సందడి ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మహేష్ సినిమాల ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా ఇవ్వని సంతోషం… ఫాన్స్ కి అనిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఇచ్చింది. రీజనల్ సినిమాలతోనే ఈ రేంజ్ మైంటైన్ చేస్తున్న మహేష్ బాబు.. నెక్స్ట్ రాజమౌళితో పాన్ వరల్డ్ రీచ్ ని టార్గెట్ చేస్తే ఇంకెలా ఉంటుందో చూడాలి.