తెలుగు చిత్రసీమలో మరో దిగ్గజం అస్తమించింది. సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు. టాలీవుడ్ జేమ్స్ బాండ్ కృష్ణ వయసు రీత్యా, అనారోగ్య సమస్యలతో ఇవాళ కన్నుమూశారు. దీంతో ఘట్టమనేని కుటుంబంలో మరో విషాదం నెలకొంది. ఆయన అభిమానులు సహా సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న సూపర్ స్టార్ కృష్ణ మృతికి పలువురు సంతాపం తెలుపుతున్నారు. ఇవాళ తెల్లవారు జామున హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారు. ఆదివారం రాత్రి గుండెపోటుతో గచ్చిబౌలిలో కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు కృష్ణ.. చికిత్స పొందుతూ తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు కృష్ణ. కార్డియాక్ అరెస్ట్ కారణంగా బ్రెయిన్‌తో పాటు కిడ్నీ, లంగ్స్ ఎఫెక్ట్ అయినట్టు డాక్టర్లు తెలిపారు. ఆయన వయసు 79 ఏళ్ళు.
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీని పరామర్శించనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. రేపు ఉదయం 11 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో కృష్ణ భౌతికకాయనికి నివాళులు అర్పించనున్న ఆయన.. వారికి కుటుంబసభ్యలను ఓదార్చనున్నారు.. ఇక, రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు గచ్చిబౌలి నుంచి పద్మాలయకు కృష్ణ అంతిమ యాత్ర సాగనుండగా.. పద్మాలయలో పూజలు నిర్వహించిన అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, టీడీపీ నేత రామ్మోహనరావు. మహేష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన చంద్రబాబు
సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. మహేష్ బాబుని పరామర్శించి ధైర్యం చెప్పిన మంత్రి కేటీఆర్.
సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన మెగాస్టార్ చిరంజీవి, అశ్వినీదత్, విజయేంద్రప్రసాద్, కాంగ్రెస్ నేతలు ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మదన్ మోహన్..
హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ సీఎస్ ను ఆదేశించిన సీఎం కేసీఆర్.రేపు మహా ప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు.
డాక్టర్ కె లక్ష్మణ్, పార్లమెంట్ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు నేడు తేదీ 15 నవంబర్ 2022న హైదరాబాదులో విడుదల చేసిన ప్రకటన
ప్రముఖ సినీ హీరో, నిర్మాత, దర్శకుడు కృష్ణ (ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి) గారు నేడు మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
తెలుగు చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రముఖమైన స్థానాన్ని కలిగిన వ్యక్తి.
సాంఘిక, పౌరాణిక చలనచిత్రాలలో నటించి తెలుగు ప్రజలను మెప్పించిన వ్యక్తి.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చలన చిత్రం తెలుగు ప్రజలు ఎల్లప్పటికీ గుర్తించుకునే చిత్రం. ఆ చిత్రం తీయడం సాహసొపేతమైనటువంటి నటన వారి సొంతం.
జేమ్స్ బాండ్ లాంటి చిత్రాలతో తెలుగు ప్రజలకు కొత్తదనాన్ని పరిచయం చేసిన వ్యక్తి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమ, తెలుగు ప్రజలు గొప్ప సినీ నటుడిని కోల్పోయింది. వారి మరణం తెలుగు ప్రజలకు, సినిమా పరిశ్రమకు తీరని లోటు.
సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో,ఉన్నతమైన,స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్.ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు.ఈ విషాదకర సమయంలో @urstrulyMahesh, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి అంటూ ట్వీట్ చేశారు.
హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ మృతికి తీవ్ర సంతాపం తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్..కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన పవన్ కళ్యాణ్.
తెలుగు సినిమా సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ జీ మరణించారనే వార్త చాలా బాధాకరం.ఐదు దశాబ్దాల తన నట జీవితంలో, దిగ్గజ నటుడు. ఆంధ్రప్రదేశ్ నుండి కాంగ్రెస్ ఎంపీగా, అసమానమైన వృత్తిపరమైన క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఆయన మరణంతో ఒక శకం ముగిసింది. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సినీరంగానికి ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు వీహెచ్. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
విజయవాడ లో సూపర్ స్టార్ కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు టిడిపి రాష్ట్ర ప్రధాని కార్యదర్శి బుద్దా వెంకన్న. బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. కృష్ణ సినిమాల్లోనే హీరో కాదు... రియల్ హీరో. అల్లూరి సీతారామరాజు అంటే అందరికీ గుర్తుకొచ్చేది కృష్ణ. సాహసం చేయటం కృష్ణ కు వెన్నతో పెట్టిన విద్య. 2022వ సంవత్సరం కృష్ణ కుటుంభానికి దురదృష్టకరమైన సంవత్సరం..
సినీ పరిశ్రమకు కృష్ణ కొత్తతరం తెచ్చారు.
సూపర్ స్టార్ కృష్ణ మరణంతో చలనచిత్ర సీమలో ఒక శకం ముగిసింది...కేవలం నటుడు గానే కాకుండా నాకు మంచి స్నేహితుడు,నా కుటుంబానికి ఎంతో ఆప్తుడు..మంచితనానికి మారుపేరు కృష్ణ...దేవుడు చేసిన మనిషిని దేవుడే తన దగ్గరకు పిలిపించుకున్నాడు..ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ... కృష్ణ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అన్నారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు.
సూపర్ స్టార్ కృష్ణ మృతికి సంతాపంగా రేపు విజయవాడ లో నూన్ షోస్ బంద్....నగర వ్యాప్తంగా రేపు నూన్ షోస్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విజయవాడ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్...
సాయంత్రం ఐదు గంటల నుండి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహం అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు.
విశాఖ జగదాంబ జంక్షన్ లో సూపర్ స్టార్ కృష్ణ శ్రద్దాంజలి సభ నిర్వహించిన అభిమానులు.....
శిబిరానికి చేరుకుని నివాళులర్పించిన రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహారావు....
కృష్ణకు తాను వీరాభిమానిని...కాలేజీ రోజుల్లో తాను కృష్ణ సినిమాలను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేవాడిని...
తెలుగుసినీ రంగానికి ఒక నూతన ఒడవడి తెచ్చారు...
కృష్ణ మృతితో తెలుగుచిత్రసీమ లో ఒక యుగం ముగిసింది...
ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు
కృష్ణ పార్థివదేహాన్ని మరికాసేపట్లో హాస్పిటల్ నుండి గచ్చిబౌలి నానక్ రాం గూడ లోని ఇంటికి తరలించనున్నారు కుటుంబ సభ్యులు.. ఇంటి వద్ద కాసేపు ఉంచి అక్కడినుండి గచ్చిబౌలి స్టేడియం కు అభిమానుల సందర్శనార్థం తరలించనున్నట్లు సమాచారం. గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కృష్ణ కుటుంబ సభ్యులు,పోలీస్ అధికారులు.
సూపర్ స్టార్ కృష్ణగారి అకాల మృతికి సంతాపంగా ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉదయం ఆటలు రద్దు చేయడమైనదని ప్రకటన విడుదల చేశారు పశ్చిమగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్స్ & ఎగ్జిబ్యూటర్స్.
హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ మృతికి సంతాపం తెలిపిన బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, చింతల రామచంద్రారెడ్డి
సూపర్ స్టార్ కృష్ణ ఆకస్మిక మృతికి తెలంగాణ గవర్నర్ సంతాపం తెలిపారు. ప్రముఖ తెలుగు నటుడు మరియు నిర్మాత సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మృతి పట్ల గౌరవనీయ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ సంతాపం తెలిపారు. కృష్ణ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. ఈ కోలుకోలేని నష్టాన్ని భరించే శక్తిని మరియు మనోధైర్యాన్ని ఆయన కుటుంబానికి అందించాలని భగవంతుడిని ప్రార్థించారు గౌరవనీయులైన గవర్నర్ అని ప్రకటనలో పేర్కొన్నారు.
సూపర్ స్టార్ కృష్ణ మృతి సినిమా పరిశ్రమకు తీరని లోటు అన్నారు మంత్రి రోజా. మహేష్ బాబు కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకోవడం బాధాకరం..కృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.చదువుకునే రోజు నుంచి నేను కృష్ణ ఫ్యాన్ ని. ఆయన షూటింగులకు పరిగెత్తి వెళ్లేదాన్ని అని తన పాత రోజుల్ని గుర్తుచేసుకున్నారు మంత్రి రోజా.
టాలీవుడ్ జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ కృష్ణ మృతికి పలువురు సంతాపం తెలిపారు. టాలీవుడ్ జేమ్స్ బాండ్, దిగ్గజ నటుడు సూపర్ స్టార్, ఘట్టమనేని కృష్ణ ఆకస్మిక మరణం అత్యంత దురద్రుష్టకరం. తెలుగు సినీ వినీలాకాశం ధృవతారగా వెలుగొందిన కృష్ణ అస్తమయం సినీ రంగానికి తీరని లోటు. ఎన్నో సరికొత్త ప్రయోగాలతో తెలుగు సినిమా రంగానికి ఆయన దిక్సూచీలా నిలిచారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ యువ మంత్రానికి ముగ్ధుడైన కృష్ణగారు 1984లో కాంగ్రెస్ కుటంబంలో చేరి.. 1989 లోక్ సభ ఎన్నికల్లో నాటి ఉమ్మడి రాష్ట్రంలోని ఏలూరు లోక్ సభ స్థానం నుంచి ఘనవిజయం సాధించి పార్లమెంట్ సభ్యుడిగా సేవలందించారు. 1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో కృష్ణ జన్మించిన కృష్ణగారి మరణం సినీరంగానికి తీరని లోటు. మహేష్ బాబుకు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు మాజీ ఎంపీ మధుయాష్కీ.
ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణగారి మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి విచారం వ్యక్తం చేసిన ఏపి బిసీ సంక్షేమశాఖ, సమాచార మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ...తన ప్రతిభతో సినీ రంగంలో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులు హృదయాల్లో ఓ కౌబాయ్ స్థానంతో పాటు చిరస్మరణీయమైన స్థానం సంపాదించుకున్న నటుడు కృష్ణ. గొప్ప నటుడు, గొప్ప మనస్సున వ్యక్తిని సినీపరిశ్రమ కోల్పోవడం సినీపరిశ్రమలో నేడు విషాదకరమైన రోజుగా భావిస్తున్నాను. కృష్ణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను...కృష్ణగారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలిపుకుంటున్నాను...
ఆయన తెలుగు సినిమా రంగంలో నిజమయిన కౌబాయ్. డేర్ అండ్ డేషింగ్ . ఆయనతో కలిసి గంటల కొద్దీ కూర్చుంటే ఆయన పాజిటివ్ దృక్పథం అర్థమయ్యేది. ఆయన లేని లోటు తీర్చలేనిది. ఆయన ఒక లెజెండ్.
నటుడు కృష్ణకు ఏలూరుతో విడదీయరాని అనుబంధం వుంది.1957-59 CRR విద్యా సంస్థలో ఇంటర్మీడియట్, 59-62 Bsc Bzc పూర్తి చేశారు హీరో కృష్ణ..మాగంటి మురళి మోహన్ తో కలసి కళాశాల హాస్టల్ లో వుండి విద్య పూర్తి చేశారు కృష్ణ..కళాశాల రోజుల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు.. ఇక్కడినుంచే సినీ రంగంలో అడుగు పెట్టిన కృష్ణ ఉన్నత శిఖరాలకు చేరారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం తెలుపుతున్నారు ఏలూరు వాసులు, ఆయన సన్నిహితులు.
తెలుగు చలన చిత్ర సీమలో సూపర్ స్టార్ కృష్ణ ఒక సంచలనం, ఆయన నిర్మాత హీరో అన్నారు నటుడు సాయికుమార్.రికార్డుల గని. చక్కని రూపసిరి. ఎన్నో ప్రయోగాలు చేసిన సాహసి. జనం మనిషి. డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరో ఘట్టమనేని కృష్ణ. ఆయన కథ ఒక చరిత్ర. ఆయన కథ ఇవాళ్టితో ఆగింది. ఆయన చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. కృష్ణగారి ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి, అభిమానులకు ఆత్మస్టయిర్యం ఇవ్వాలి అన్నారు సాయికుమార్
కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి కృష్ణ ఇంటికి పార్థివ దేహం తరలిస్తున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ గారు.. ఇకలేరు అనేది జీర్ణించుకోలేని నిజం. ఆయన మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు. మహేష్ బాబు గారికి.. వారి కుటుంబానికి..
తెలుగు దర్శకుల సంఘం తరుపున.. మా ప్రగాఢ సానుబూతి తెలియజేస్తున్నాం అన్నారు తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వై.కాశీవిశ్వనాథ్.
సూపర్ స్టార్ కృష్ణ గారి ఆకస్మిక మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎన్నో విభిన్న, వీరోచిత పాత్రలతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న కృష్ణ గారి మరణం సినీరంగానికి తీరనిలోటు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా.
ప్రముఖ చలనచత్ర నటుడు కృష్ణ మృతి పట్ల సిపిఐ రాష్ట్ర సమితి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తుంది అన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. యన ఎన్నో మంచి సామాజిక చిత్రాలను తీసి ప్రేక్షకుల్ని అలరించారు. అల్లూరి సీతారామరాజు చిత్రం ద్వారా మన్యం వీరుని చరిత్రను ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. చలనచిత్ర రంగంలో ప్రయోగాలకు మారుపేరు కృష్ణ. ఆయన పరోపకారి, సేవాగుణం, తోటి నటినటుల పట్ల మర్యాద, సాహసం, ధైర్యం కలిగిన నటుడు.ఆయన చేసిన సినిమాలు నష్టాలలో వచ్చి నిర్మాత ఆర్థికంగా చితికిపోయినప్పుడు ఉచితంగా సినిమాలు తీసి తోడ్పాటు అందించేవారు.సినీ రంగంలో సూపర్ స్టార్ ఎవరు అనేదానిపై ఆనాటి సినీ పత్రిక జ్యోతి చిత్ర చేసిన ఓటింగ్లో వరుసగా మూడు సంవత్సరాలు కృష్ణకు మద్దతు ప్రకటించారు.ఆయన మృతి చలనచిత్ర రంగానికి తీరని లోటు. ఆయన మృతికి సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.
కృష్షగారి మరణం చిత్రపరిశ్రమకు తీర్చలేని లోటు అన్నారు నటుడు రవితేజ. ఆయనతో కలిసి నటించడం నాకెంతో సంతోషం, ఆనందం కలిగించింది. మహేష్ బాబు, కుటుంబసభ్యులకు తీవ్ర సానుభూతి తెలిపారు రవితేజ.
సూపర్ స్టార్ కృష్ణ మృతికి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంతాపం తెలిపారు. మహేష్ బాబుకు, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు ఎంపీ సీఎం రమేష్.
సూపర్ స్టార్ కృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
సినీ నటుడు కృష్ణ మృతి తీరని లోటు అన్నారు ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారి మృతి పట్ల రాష్ట్ర గృహా నిర్మాణ శాఖ మంత్రి శ్రీ జోగి.రమేష్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు వంటి సినిమాలలో నటించి ప్రజలకు దేశభక్తి పై ప్రేరణ కలిగించారు. ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని మంత్రి సంతాప సందేశంలో నివాళులు అర్పించారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు మనో ధైర్యం కల్పించాలని ఆయన పేర్కొన్నారు
సూపర్ స్టార్ కృష్ణ మృతికి ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్ సంతాపం తెలిపారు. మహేష్ బాబు, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.
కృష్ణ గారి మృతి తీరని లోటు. మహేష్ బాబు గారికి, ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన లేరన్న వార్త అభిమానులందరిని షాక్ కి గురిచేసింది. భారతీయ సినిమా రంగానికి కృష్ణ గారు చేసిన సేవను ఎవరూ మరిచిపోలేరు.
.సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు గలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి వూపిరి, ధైర్యానికి పర్యాయపదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం.. వీటి కలబోత కృష్ణ గారు. అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమ లోనే కాదు, భారత సినీపరిశ్రమ లోనే అరుదు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రు నివాళి Ad ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటూ నా సోదరుడు మహేష్ బాబుకు, ఆయన కుటుంబ సభ్యులందరికీ,అసంఖ్యాకమైన ఆయన అభిమానులకి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియ చేసుకొంటున్నాను అని ట్వీట్ చేశారు చిరంజీవి.
కృష్ణ గారు అంటే సాహసానికి మరో పేరు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణమైన పాత్రలే కాకుండా, సాంకేతికంగా కూడా తెలుగు సినిమాకు ఎన్నో విధానాలు పరిచయం చేసిన మీ ఘనత ఎప్పటికి చిరస్మరణీయం.
My thoughts are with Mahesh Anna and the family. Om Shanthi. Superstar forever.
తెలుగు సినీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ గారి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రి శ్రీ కే తారకరామారావు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. 350 కి పైగా సినిమాల్లో నటించిన కృష్ణ తెలుగు సినీ ప్రేక్షకుల మనసులలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా ఆయన తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలు అజరామరం అని కొనియాడారు మంత్రి కేటీఆర్.
తెలుగు సినిమా చరిత్రలో విభిన్న తరహ పాత్రలను పోషించడంతోపాటు, అద్భుతమైన సినిమాలను నిర్మించి తెలుగు సినిమా చరిత్రలో తనదైన స్థానాన్ని సూపర్ స్టార్ కృష్ణ సృష్టించుకున్నారన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మరణం తెలుగు సినిమా రంగానికి తీరని లోటన్న కేటీఆర్, కృష్ణ గారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారు. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు మంత్రి కేటీఆర్.
చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన శ్రీ కృష్ణ గారు తుది శ్వాస విడిచారనే విషయం ఎంతో ఆవేదన కలిగించింది. శ్రీ కృష్ణ గారు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని ఆశించాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. శ్రీ కృష్ణ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్నేహశీలి, మృదుస్వభావి అయిన కృష్ణ గారు ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు.
మద్రాస్ లో ఉన్నప్పటి నుంచి మా కుటుంబంతో చక్కటి అనుబంధం ఉంది.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా శ్రీ కృష్ణ గారు చేసిన సేవలు చిరస్మరణీయాలు. తెలుగు సినిమా పురోగమన ప్రస్థానంలో ఆయన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేశారు. విభిన్న పాత్రలు పోషించిన శ్రీ కృష్ణ గారు కౌబోయ్, జేమ్స్ బాండ్ కథలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించారు. పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా జీవితంలో కూడా ఆయన తన ముద్ర వేశారు. సినిమా రంగం క్షేమాన్ని కాంక్షించే శ్రీ కృష్ణ గారి మరణం తెలుగు చలనచిత్ర సీమకు తీరని లోటు. ఆయన కుమారుడు శ్రీ మహేష్ బాబు గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా అన్నారు పవన్ కళ్యాణ్.
బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సూపర్ స్టార్ కృష్ణ మృతి సినీ రంగానికి తీరని లోటు అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నా. స్వాతంత్ర్య సమర యోధుల జీవితాలు తెరకెక్కించిన మహా నటుడు కృష్ణ అని శ్లాఘించారు.
ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ శ్రీ ఘట్టమనేని కృష్ణ గారు ఇక లేరని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు వెండి తెర ‘కౌబాయ్’ గా అభిమానుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న కృష్ణ గారి మృతి సినీ రంగానికి తీరని లోటు. కుటుంబ చిత్రాలు, యువతలో, కార్మికుల్లో స్ఫూర్తిని నింపడం వంటి పాత్రలతో 350కి పైగా చిత్రాల్లో నటించిన కృష్ణ గారు తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలు చిరస్మరణీయం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
పద్మభూషణ్, సూపర్ స్టార్, మాజీ ఎం.పీ డాక్టర్. కృష్ణ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు..సినిమా రంగంలో అనేక విప్లవత్మక మార్పులు తెచ్చి నూతన ఒరవడి సృష్టించిన కృష్ణ మరణం తెలుగు సినిమా రంగానికి తీరని.లోటు. కృష్ణ హైదరాబాద్ లో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేసారు.కృష్ణ గారి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా... ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అన్నారు రేవంత్ రెడ్డి.
కాంటినెంటల్ ఆస్పత్రికి చేరుకున్నారు కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆది శేషగిరిరావు.