Sunitha: సింగర్ సునీత గురించి సంగీత ప్రియులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నిత్యం బిజీగా ఉండే ఆమె మరోపక్క సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. ఇంట్లో జరిగే ప్రతి పండుగను, అద్భుతమైన జ్ఞాపకాలను అభిమానులతో పంచుకొంటూ ఉంటుంది. ఇక సునీత బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. రామ్ ను కలిశాకా తన జీవితం మారిపోయిందని, తనను తన భర్త ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడని ఆమె చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అయితే అంతటి ప్రేమను చూపిస్తున్న భర్త పుట్టినరోజు త్వరలో రానునుండడంతో అతనికి పెద్ద సర్ప్రైజ్ ఇవ్వాలని భావిస్తున్నదట.
రామ్ వీరపనేని చదువుకున్న స్కూల్లో ఆయన పుట్టినరోజు వేడుకలు జరపాలని ప్లాన్ చేస్తున్నదట. భర్తకు ఇష్టమైన స్నేహితులను, బంధువులను పిలిచి సర్ప్రైజ్ ఇవ్వనున్నదని సునీత సన్నిహితుల వర్గాల నుంచి సమాచారం. ఇందుకోసం రామ్ స్నేహితులను స్వయంగా కలిసి పుట్టినరోజు వేడుకలకు రావాలని పిలుస్తున్నదట. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.