Sunil: హీరోగా మళ్ళీ రీఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కమెడియన్‌గా తన కెరీర్ ప్రారంభించిన సునీల్.. అప్పట్లో ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపేశాడు. ఎనలేని క్రేజ్ సంపాదించాడు. కామెడీ పండాలంటే, సునీల్ ఉండాల్సిందేనన్న స్థాయికి ఎదిగాడు. అంత క్రేజ్ ఉండడం వల్లే, హీరోగా నటించే ఛాన్స్ వచ్చింది. ‘అందాల రాముడు’తో తన అదృష్టం పరీక్షించుకోగా.. అది మంచి విజయం సాధించింది. అనంతరం రాజమౌళితో చేసిన ‘మర్యాదరామన్న’ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో.. ఇక హీరోగానే కెరీర్ కొనసాగించాలని సునీల్ నిర్ణయించుకున్నాడు. దీని తర్వాత చేసిన సినిమాల్లో కొన్ని హిట్ అయ్యాయి కానీ, మిగతావి మాత్రం ఘోర పరాజయాల్ని చవిచూశాయి. సునీల్ దాదాపు ఫేడవుట్ అయ్యే స్థాయికి వెళ్ళిపోయాడు.
దీంతో, సునీల్ తిరిగి మళ్ళీ తన పాత జోన్‌కే వచ్చేశాడు. కమెడియన్‌గా పలు సినిమాలు చేశాడు. ‘కలర్ ఫోటో’తో విలన్‌గా మారిన ఇతను.. ‘పుష్ప’లో సిసలైన విలనిజం చూపించాడు. ‘ఎఫ్3’ మరోసారి నవ్వించేందుకు రెడీ అయిన సునీల్.. హీరోగా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. అవును, ఈ విషయాన్ని స్వయంగా సునీల్ ఎఫ్3 ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. త్వరలోనే తాను హీరోగా రీఎంట్రీ ఇస్తున్నానని, ఓ మంచి ప్రాజెక్టుతో కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నానని సునీల్ వెల్లడించాడు. అయితే, ఆ ప్రాజెక్ట్ వివరాల్ని మాత్రం వెల్లడించలేదు. మరి, ఈ సినిమాతోనైనా సునీల్ హీరోగా ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.
Also Read
- Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్‌లోకి స్వాగతం
- Pradeep Ranganathan: ఆ డైరెక్టర్'తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
- Rao Bahadur: "మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!" రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
- Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
తాజావార్తలు
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
-
Apple Products: బిగ్‌షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
-
Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
-
Gossip : రేపే థియేటర్లలో ‘గాసిప్’
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!