Sundeep Kishan’s VIVAHA BHOJANAMBU Kitchen & Bar Restaurant Opening Today: యువ హీరో సందీప్ కిషన్‌లో అభిరుచి గల నిర్మాత, మంచి భోజన ప్రియుడు ఉన్నారని అందరికీ తెలిసిందే. అందుకే ఆయన అందరికీ రుచికరమైన భోజనం, వంటలు వడ్డించడానికి ‘వివాహ భోజనంబు’ అని హైదరాబాద్ నగరంలో, అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా రెస్టారెంట్లు ప్రారంభించి తమ సేవలు అందిస్తున్నారు. ఈ రెస్టారెంట్లు ప్రజల అభిమానాన్ని చూరగొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సందీప్ కిషన్ మరో రెస్టారెంట్ మొదలు పెడుతున్నాడు. తనకు బాగా అచ్చొచ్చిన ‘వివాహ భోజనంబు’ పేరుతో బార్ అండ్ రెస్టారెంట్ మొదలు పెడుతున్నారు. ఈరోజు జూబిలీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న ఈ బార్ అండ్ రెస్టారెంట్ ఓపెనింగ్ కి అనేక మంది సెలబ్రిటీలు హాజరు కానున్నారు.
Lishi Missing: మా చెల్లి మిస్సింగ్.. పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు
ఇక సినిమాల విషయానికి వస్తే ఈ మధ్యలో ఆయన ఊరి పేరు భైరవకోన అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో ఆసక్తికరమైన కథాంశముతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు. విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని రాజేష్ దండ హాస్య మూవీస్ బ్యానర్ మీద నిర్మించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పించిన ఈ సినిమాకి చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే ధనుష్ తో కలిసి ఆయన కెప్టెన్ మిల్లర్ అనే సినిమాలో కనిపించాడు. ఇప్పుడు ధనుష్ దర్శకుడిగా మారి హీరోగా నటిస్తూ తెరకెక్కిస్తున్న రాయన్ సినిమాలో కూడా సందీప్ కిషన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక త్వరలోనే మరో తెలుగు సినిమాను కూడా అనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.