యంగ్ హీరో సందీప్ కిషన్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్న నటిస్తున్న సినిమా ‘మైఖేల్’. గౌతమ్ వాసుదేవ్ మీనన్, విజయ్ సేతుపతి, వరుణ్ సందేశ్, దివ్యాంషా కౌశిక్, వరలక్ష్మి శరత్ కుమార్, అనసూయలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ తెలుగు ట్రైలర్ ని నందమూరి బాలకృష్ణ లాంచ్ చేశాడు. టీజర్ తోనే యాక్షన్ డ్రామా సినిమా చూడబోతున్నాం అనే ఫీలింగ్ ని కలిగించిన చిత్ర యూనిట్, మైఖేల్ ట్రైలర్ తో మరింత ఇంప్రెస్ చేశారు. అమ్మాయి జోలికి వెళ్లొద్దు, ప్రేమలో పడొద్దు అని ప్రతి మేల్ క్యారెక్టర్ తో చెప్పించిన దర్శకుడు, ట్రైలర్ ఎండ్ అయ్యే టైంకి అమ్మాయి కోసమే మైఖేల్ ఒక యుద్ధాన్ని చేశాడు అని చూపించాడు. అయినా అమ్మాయి కోసం కాకుండా అబ్బాయి వేరే ఏ విషయం గురించి బ్రతకాలి అంటూ సందీప్ చెప్పిన డైలాగ్ వింటే, ఇదే మైఖేల్ సినిమా కథగా కనిపిస్తుంది.
అమ్మాయి జోలికి వెళ్లొద్దు, అమ్మాయి కోసం బ్రతకాలి అనే రెండు లైన్స్ మధ్యలో డిజైన్ చేసిన ఈ యాక్షన్ డ్రామా ట్రైలర్ ఇంటెన్స్ గా ఉంది. హ్యుజ్ సెటప్ లో, బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫి, బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, టెర్రిఫిక్ ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ లో మైఖేల్ ట్రైలర్ ని మరింత ఇంప్రెసివ్ గా మార్చాయి. సందీప్ కిషన్ చాలా రా అండ్ రస్టిక్ గా కనిపిస్తున్నాడు. అతని ఫిజిక్ మైఖేల్ సినిమాకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. సేతుపతి లుక్ చాలా పవర్ ఫుల్ గా ఉంది, వరుణ్ సందేశ్ కూడా కొత్తగా కనిపిస్తున్నాడు. హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకూ ప్రతి ఫిమేల్ క్యారెక్టర్ కి మైఖేల్ మూవీలో చాలా ఇంపార్టెన్స్ ఉందనే విషయం ట్రైలర్ తోనే అర్ధం అవుతుంది. మొత్తానికి మైఖేల్ ట్రైలర్ సినిమాపై అంచనాలని అమాంతం పెంచింది. ఫిబ్రవరి 3న రిలీజ్ కానున్న మైఖేల్ మూవీ సందీప్ కిషన్ సాలిడ్ ఇస్తుందేమో చూడాలి.