Sundari Lyrical Song from Prem Kumar: ‘సుందరీ, ఓ కన్నే.. నీ వైపే నన్నే లాగింది చూపుల దారమే నీ కన్నుల్లోనే దాగింది మిన్నే..’’ అనుకుంటూ మనసుకి నచ్చిన అమ్మాయి గురించి ‘ప్రేమ్ కుమార్’ ఒక సాంగేసుకున్నాడు. అసలు ఇంతకీ ప్రేమ్ కుమార్ ఎవరు? అతని మనసుకు నచ్చిన అందాల ముద్దుగుమ్మ ఎవరు? అనే విషయాలు తెలియాలంటే మా ప్రేమ్ కుమార్ సినిమా చూడాల్సిందే అని అంటున్నారు దర్శక నిర్మాతలు. హీరో సంతోష్ శోభన్ తాజాగా నటించిన ‘ప్రేమ్ కుమార్’ సినిమా రిలీజ్‌కి సిద్ధమవుతోంది. రైటర్ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా లవ్ అండ్ ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కింది. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించారు.
Sai Dharam Tej: నాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు.. అసలు నిజం ఏంటంటే?
కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా నుంచి బుధవారం ‘సుందరీ..’ అనే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఎస్.అనంత్ శ్రీకర్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ సినిమాలో ‘సుందరీ..’ పాటను కిట్టు విస్సాప్రగడ రాయగా, కార్తీక్ ఆలపించారు. పెళ్లి చేసుకోవాలనుకునే హీరోకి ఎదురయ్యే ఇబ్బందికరమైన పరిస్థితులను ఎంటర్‌టైనింగ్‌గా ‘ప్రేమ్ కుమార్’ సినిమాలో దర్శకుడు అభిషేక్ మహర్షి ఆవిష్కరించడం గమనార్హం. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ రాగా సినిమాతో పక్కా హిట్ కొట్టేస్తామని నమ్ముతోంది సినిమా యూనిట్. గ్యారీ బి హెచ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి డీఓపీగా రాంపీ నందిగం పనిచేస్తున్నారు. ఇక ‘ప్రేమ్ కుమార్’ పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లోకి విడుదలవుతున్న విషయం తెలిసిందే.