Sundar C Comments on Telugu Cinemas Copy goes Viral: తమిళ దర్శకుడు సుందర్ సి గత మూడు దశాబ్దాలుగా హాస్య చిత్రాలు, వినోదాత్మక చిత్రాలు చేసి ఫేమస్ అయ్యాడు. అప్పుటి స్టార్ హీరోయిన్ ఖుష్బూని వివాహమాడిన ఆయన మొదటి సినిమా 1995లోనే చేశారు. ఆ అనంతరం రజినీకాంత్, అజిత్, కమల్ హాసన్ వంటి వారితో కూడా పని చేశారు. ఆయన చేసే చాలా సినిమాలు కామెడీ ఆధారంగా ఉంటాయి. అవి కూడా ఇతర భాషల నుండి కాపీ చేసినవో లేదా ఇన్స్పైర్ అయి చేసినవో అని ఈజీగా చెప్పవచ్చు. అయితే ఇదే విషయాన్ని తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడమే కాదు తెలుగు సినీ పరిశ్రమ మీద, ఇక్కడ దర్శకుల మీద కూడా అతని స్టైల్ లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రశాంత్ హీరోగా సుందర్ దర్శకత్వంలో 2003వ సంవత్సరంలో వచ్చిన విన్నర్ అనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
Nagababu: గుండెపోటుతో NRI మృతి.. తీవ్ర శోకానికి గురిచేసిందంటూ నాగబాబు ట్వీట్!
అదే సినిమా గురించి ఇప్పుడు ఇంటర్వ్యూలో ప్రస్తావించగా దాని గురించి దర్శకుడు స్పందించాడు. తాను తెలుగు దర్శకులతో కాపీ అంశాల మీద ఫైట్ చేయడంలో ఫెయిల్ అయ్యారని చెప్పుకొచ్చాడు. విన్నర్ సినిమా చేయడం కంటే ముందు కొందరు తెలుగు దర్శకులు చేసిన సినిమాలు చూశాను. ఆ సినిమాలలో నా సినిమాల్లోని కొన్ని సీన్స్ ఎత్తేసినట్టు నాకు అర్థమైంది. వాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే కాపీ చేశారు, అలాగే దొంగతనం చేశారని కూడా అనొచ్చు. అప్పుడు నాకు వాళ్ల మీద కోపం వచ్చింది. తెలుగు సినీ పరిశ్రమ మొత్తం మీద కోపం వచ్చింది, అందుకే తెలుగు సినిమాలన్నీ కలిపి ఒక కాపీ సినిమా చేయాలని అనిపించింది. అదే విషయాన్ని ప్రశాంత్ కి చెప్పాను, తెలుగు సినిమాల నుంచి రీ క్రియేట్ చేసిన సీన్లతో ఒక సినిమా చేద్దామని అంటూ పేర్కొన్నాడు. వెంటనే ఒక పది తెలుగు సినిమాలు డీవీడీలిచ్చి ఇదే మన సినిమా అని చెప్పానని అన్నాడు.
అయితే ఆ సినిమాలో వడివేలుతో ఒక సీన్ చేశానని, ఆ సీన్ ని కూడా తర్వాత ఒక తెలుగు సినిమాల్లో బ్రహ్మానందాన్ని పెట్టి కాపీ చేశారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఆ సమయంలో తెలుగు డైరెక్టర్ల లాగా నేను కాపీ కొట్టలేనని అర్థమైందని సుందర్ చెప్పుకొచ్చాడు. సుందర్ డైరెక్ట్ చేసిన అరణ్మై సినిమాల సిరీస్లో నాలుగో భాగాన్ని తెలుగులో బాక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. తమన్నా, రాశి కన్నా హీరోయిన్లుగా ఉండడంతో పాటు వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ కాంబినేషన్ కామెడీ సీన్స్ కూడా ఉన్నట్టు ట్రైలర్తో అర్థమవుతుంది. ఈ సినిమా మే మూడో తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా రాబోతోంది. సరిగ్గా తెలుగు ప్రేక్షకుల ముందుకు సినిమాని తీసుకొస్తూ తెలుగు సినీ పరిశ్రమ మీద తెలుగు సినీ దర్శకుల మీద సుందర్ చేసిన కామెంట్ల మీద తెలుగు సినీ ప్రేమికులు ఫైర్ అవుతున్నారు.