Bigg Boss 9 : సుమన్ శెట్టి రెచ్చిపోయాడు. తనలోని ఇన్నోసెంట్ ను పక్కన పెట్టేసి తడాఖా చూపించాడు. మనకు తెలిసిందే కదా.. మొన్నటి ఎపిసోడ్ లో డిమాన్ పవన్ సుమన్ శెట్టిని లాగి పడేశాడు. కానీ నిన్నటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టి రెచ్చిపోయాడు. ఈ టాస్క్ లో టెన్నెంట్స్ కు ఓనర్లు అయ్యే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఓనర్లు అయిన మనీష్, ప్రియ విసిరే బొమ్మలను పట్టుకుని బాస్కెట్ లో వేసుకోవాలి. ఫైనల్ బజర్ వరకు వచ్చేసరికి ఎవరి బాస్కెట్ లో ఎక్కువ బొమ్మలు ఉంటే వారే విన్నర్. బొమ్మలను పట్టుకున్న వారు బాస్కెట్ లో వేసుకున్నారు. ఈ గ్యాప్ లో బొమ్మలను దొంగిలించే పని షురూ చేశారు. ఇమ్మాన్యుయెల్, ఫ్లోరా కలిసి రీతూను కిందపడేశారు. ఇక సుమన్ ను కిందపడేయడానికి ఫ్లోరా ట్రై చేస్తే.. మనోడు ఈడ్చి పడేశాడు. దాంతో ఆమె కింద పడిపోయింది.
Read Also : Disco Dancer : ఇండియాలో తొలి వంద కోట్ల సినిమా ఏదో తెలుసా..?
ఆ తర్వాత సంజనా కూడా ఇలాగే ట్రై చేసింది. కానీ సుమన్ ఊరుకోలేదు. ఎవరినైనా కొడితే ఎలిమినేట్ చేస్తానని ప్రియ చెప్పింది. అయినా సరే సుమన్ తగ్గలేదు. సంజనాను మోచేతితో నెట్టేశాడు. ఆమె కూడా కింద పడింది. సుమన్ ను ప్రియ ఎలిమినేట్ చేసింది. ఆ కోపంతో సుమన్ బాస్కెట్ ను కాలితో తన్నాడు. దెబ్బకు అంతా షాక్ అయిపోయారు. సుమన్ పక్కకు వెళ్లి కోపంగా కూర్చున్నాడు. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సుమన్ శెట్టి తడాఖా చూపించాడని కొందరు అంటుంటే.. ఆడపిల్లలను ఇలా నెట్టేయడం కరెక్ట్ కాదంటున్నారు. ఇన్నోసెంట్ సుమన్ ను ఇలా చూడలేకపోతున్నాం అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి మొన్నటి వరకు సుమన్ కు మంచి మార్కుటు ఉన్నాయి. ఈ దెబ్బతో ఆయనకు కొందరు నెగెటివ్ గా మారుతున్నారు.
Read Also : Bigg Boss 9 : ఏంటీ పిచ్చి పని.. సుమన్ శెట్టిని లాగి పడేసిన డిమాన్ పవన్..