Sukumar : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది మూవీ చేస్తున్నాడు. ఉత్తరాంధ్ర విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీ కోసం వరుస షూటింగులతో బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు తర్వాత సుకుమార్ తో చరణ్ మూవీ చేయాల్సి ఉంది. దాని కోసం ఇప్పటి నుంచే సుకుమార్ కథ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఓ స్టోరీ లైన్ ను రామ్ చరణ్ కు చెప్పగా ఓకే చేశాడంట. దాన్ని డెవలప్ చేసే పనుల్లో బిజీగా ఉంటున్నాడు సుకుమార్. బుచ్చిబాబు సినిమా వచ్చే మార్చిలో రిలీజ్ అవుతోంది. దాని తర్వాత సుకుమార్ కథ సెట్స్ మీదకు వెళ్లాలి. అందుకే ఇప్పటి నుంచే కథ మీద కసరత్తులు మొదలుపెట్టాడంట లెక్కల మాస్టారు.
Read Also : War 2 Event : విజయవాడలో వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. క్లారిటీ..
దీని కోసం అమెరికాలో తన టీమ్ తో సిట్టింగ్ వేసినట్టు ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గానే తన టీమ్ ను అమెరికాకు పిలిపించుకున్నాడంట. అక్కడే కథను డెవలప్ చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. కథ పూర్తి అయిన తర్వాతనే ఇండియాకు వస్తాడని ప్రచారం జరుగుతోంది. సుకుమార్ చాలా వరకు విదేశాల్లోనే కథలు రాసుకుంటాడు. ఇప్పుడు రామ్ చరణ్ తో చేయబోయే కథ కూడా తన స్టైల్ లో రాస్తున్నాడంట. భారీ వెయిట్ ఉన్న యాక్షన్ సీన్స్, ఎమోషన్స్, సెంటిమెంట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తన ప్రతి సినిమాలో ఉండే ఓ ఎమోషన్ తో కూడిన యాక్షన్ ను బేస్ చేసుకుని కథ రాస్తున్నాడంట. ఇది ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసేసి వచ్చే ఏడాది స్టార్టింగ్ లో ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేస్తాడంట. పెద్ది మూవీ అయిపోగానే ఈ మూవీని పట్టాలెక్కించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
Read Also : HHVM : వీరమల్లును కామెడీ మూవీగా తీయాలనుకున్నాం.. జ్యోతికృష్ణ కామెంట్స్