అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా, సుకుమార్ ని పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్చింది ‘పుష్ప ది రైజ్’ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ సీక్వెల్ గా ‘పుష్ప ది రూల్’ సినిమా సెట్స్ పై ఉంది. రీసెంట్ గా అల్లు అర్జున్ బర్త్ డే రోజున పుష్ప ది రూల్ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సుకుమార్ అండ్ టీం, ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన పుష్ప ది రూల్ “గంగమ్మ జాతర” లుక్ పార్ట్ 2కి కావలసిన బజ్ ని జనరేట్ చేసింది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత మళ్లీ సైలెంట్ గా తమ పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు పుష్ప 2 యూనిట్.
ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ సీలేరు అడవుల్లో జరుగుతుంది. సీలేరు నదిని అనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో పుష్ప 2 షూటింగ్ చేస్తున్నారు. ఇది ఏజెన్సీ ప్రాంతం కిందకి వస్తుంది. సాయంత్రం ఐదు దాటిన తర్వాత రోడ్డ పైకి రావడానికి వీలులేని చోట సుకుమార్ అండ్ టీం షూటింగ్ చేస్తున్నారు. ఈ షూటింగ్ స్పాట్ నుంచి నటుడు బ్రహ్మాజీ, సుకుమార్ ఫోటోని షేర్ చేశాడు. “మ్యాన్ ఆన్ ఫైర్” అని కోట్ చేసిన బ్రహ్మాజీ, సుకుమార్ స్టైల్ గా గాగుల్స్ తో ఉన్న ఫోటో ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో సుకుమార్ ని చూస్తే, సుక్కు కూడా ఒక మంచి క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అనిపించకమానదు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో సుకుమార్ ఆ రేంజులో ఉన్నాడు.
Man On Fire 🔥 pic.twitter.com/6Hto0DsO0n
— Brahmaji (@actorbrahmaji) May 13, 2023